ప్రిన్సిపల్ కొట్టాడని.. జాడలేకుండా పారిపోయిన విద్యార్ధులు!
ప్రిన్సిపల్ చేయి చేసుకున్నందుకు ఇద్దరు విద్యార్ధులు జాడలేకుండా పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ మా దుర్గాజీ సీనియర్ సెకండరీ విద్యాలయలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ ప్రిన్సిపల్ ఇద్దరు విద
న్యూఢిల్లీ: ప్రిన్సిపల్ చేయి చేసుకున్నందుకు ఇద్దరు విద్యార్ధులు జాడలేకుండా పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ మా దుర్గాజీ సీనియర్ సెకండరీ విద్యాలయలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
స్కూల్ ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్ధులను కొట్టి ఇంటికి పంపించి వేయడంతో.. బయటికి వచ్చిన పిల్లలు ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని గుండెలు బాదుకున్నారు.

''మా కుమారుడు ఇంటికి రాకపోవడంతో స్కూలుకు వెళ్లి ఆరా తీశాను. మధ్యాహ్నం 12 గంటలకే పిల్లాడిని ఇంటికి పంపించేశామని స్కూలు యాజమాన్యం చెప్పింది...'' అని ఓ విద్యార్ధి తండ్రి పేర్కొన్నారు.
తమ కుమారుడిని కూడా అలాగే అర్థాంతరంగా స్కూలు నుంచి పంపించేశారని మరో విద్యార్ధి తల్లి బోరును విలపించారు. తాను స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
విద్యార్ధుల అదృశ్యానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్ధుల పట్ల స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యంపై ఇటీవల అనేక దారుణ సంఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
క్లాస్ టీచర్ తనను తీవ్రంగా కొట్టి అవమానించారంటూ ఉత్తరప్రదేశ్‌కి చెందిన 5 తరగతి విద్యార్ధి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపై ఎవర్నీ అంతలా కొట్టొద్దని టీచర్‌కు చెప్పండంటూ అతడు రాసిన సూసైడ్ నోట్ పెద్దఎత్తున చర్చకు దారితీసింది. అలాగే గుర్గావ్ లోని రియాన్ స్కూల్లో కూడా మరో విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications