24 గంటల్లోపే మళ్లీ స్వల్ప భూకంపం: రుద్రప్రయాగ్‌లో..
24 గంటలు గడవక ముందే ఉత్తరాదిన మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మంగళవారం నాడు మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది.
డెహ్రాడూన్: 24 గంటలు గడవక ముందే ఉత్తరాదిన మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మంగళవారం నాడు మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది.
భూకంప లేఖినిపై తీవ్రత 3.6గా నమోదయింది. ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో 5.8 తీవ్రతతో సోమవారం రాత్రి భూకంపం సభవించిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యూపీలోని నోయిడాలో కూడా ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.
ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండోసారి భూ ప్రకంపనలు రావడంతో రుద్రప్రయాగ్ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం గం.1.51 నిమిషాలకు పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు.












Click it and Unblock the Notifications