లాఠీలకు నూనె రాసి ఎముకలు విరిచేస్తామని సీరియస్ వార్నింగ్
ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా ఈ వాలెంటైన్స్ డే ను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో మాత్రం కొన్ని వర్గాల నుంచి వాలెంటైన్స్ డే పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తుందని భారతీయ సాంప్రదాయాలు, విలువలకు విరుద్ధమైనది అని కొన్ని ముఖ్యమైన హిందూ సంఘాలు వాదిస్తూ వస్తున్నాయి.
వాలెంటైన్స్ డే జరుపుకోవటాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాలు
వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి వ్యతిరేకిస్తున్నాయి. ఇక వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులు కలవకుండా పార్కుల దగ్గర, రెస్టారెంట్ల దగ్గర నిఘా పెడుతున్నాయి. ముఖ్యంగా విశ్వ హిందు పరిషత్తు, బజరంగదళ్, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తదితర సంస్థలు, వీటికి అనుబంధంగా కొన్ని సంస్థలు హిందూ యువ వాహిని, శ్రీరామ్ సేన వంటివి వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

నో వాలెంటైన్స్ డే... హిందూ సంఘాల హెచ్చరికలు
వాలెంటైన్స్ డే రోజు లవర్స్ దొరికారు అంటే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఇప్పటికే అనేకచోట్ల ఇది మన హిందూ సంస్కృతికి వ్యతిరేకమని, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని ఇది పెంచుతుందని, దీనిని జరుపుకోవడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ప్రాంతాలలో దీనిపైన హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
యూపీలో లేఖలు పంచుతూ హెచ్చరికలు
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈసారి వాలెంటైన్స్ డే జరుపుకోకుండా ఇప్పటి నుంచే లేఖలను పంచుతూ హెచ్చరికలను జారీ చేస్తోంది క్రాంతి సేన. ప్రేమికుల దినోత్సవం ముంగిట యూపీ ముజఫర్‌నగర్‌లోని 'క్రాంతి సేన' ప్రేమికులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 'ప్రేమికులు ఎక్కడ కనిపించినా వారి ఎముకలు విరిచేస్తాం' అని లాఠీలకు నూనె రాస్తూ హెచ్చరించింది.
వాలెంటైన్స్ డే చేస్తే వారికి కూడా చుక్కలే
కిస్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, వాలంటైన్స్ డే వేడుకలు విదేశీ సంస్కృతి అని క్రాంతి సేన స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్థితుల్లో జంటలు కనిపిస్తే వారితో పాటు హోటల్, రెస్టారెంట్ యజమానులపై చర్యలు తీసుకుంటామని లేఖలు పంచింది. ఇక యూపీలో ఈ తీవ్ర హెచ్చరికల మధ్య వాలెంటెన్స్ డే జరుపుకోవడం ప్రేమికులకు కష్టమే.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications