పటేల్ కృషిని జాతి మరువదు: మోడీ నివాళి
హైదరాబాద్: దేశాన్ని ఏకం చేసేందుకు పటేల్ చేసిన కృషిని భారత జాతి ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, తదితరులు నివాళులర్పించారు.
రాజ్‌పథ్‌లో ఐక్యత పరుగును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ... ‘పటేల్ రాజనీతి కౌశలం ఎంతో గొప్పది. పటేల్ జీవన విధానం, సిద్ధాంతాలు సదా ఆచరనీయం. మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం మనం మాట్లాడుతున్నాం. అహ్మదాబాద్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై పటేల్ అప్పట్లోనే ప్రతిపాదించారు' అని చెప్పారు.

‘పటేల్ స్పూర్తితో ఐక్య శ్రేష్ఠ భారత్ సాధన దిశగా కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. దేశం బలంగా, సాధికారికంగా నిలబడిందంటే సర్ధార్ సంకల్పమే కారణం. పటేల్ అహ్మదాబాద్‌లో 222 రోజుల పాటు స్వచ్ఛ అభియాన్ నిర్వహించారు. అప్పటి నుంచే స్వచ్ఛత కార్యక్రమానికి ముందడుగు పడిందని గుర్తు చేశారు' అని ప్రధాని మోడీ తెలిపారు.
‘స్వచ్ఛతపై పటేల్‌కు ఉన్న సంకల్పాన్ని చూసి గాంధీ అభినందించారు. సర్దార్ పటేల్ దేశ విభజన శక్తులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఐక్యభారత్, శ్రేష్ఠభారత్ సాధన దిశగా కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఐక్యంగా ఉండడమే భారత్‌కు అతిపెద్ద శక్తి' అని మోడీ అన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications