మూడేళ్లలో 32 శాతం పెరిగినా, యోగీ ఆస్తులు రూ.కోటి కంటే తక్కువ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆస్తులు గత మూడేళ్లలో 32 శాతం మేర పెరిగాయి. శాసన మండలి ఉప ఎన్నికల్లో ఆయన సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్న వివరాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆస్తులు గత మూడేళ్లలో 32 శాతం మేర పెరిగాయి. శాసన మండలి ఉప ఎన్నికల్లో ఆయన సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్న వివరాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

చదవండి: జయ సమాధి వద్ద ఉద్రిక్తత: పన్నీరులా యోగా చేయొద్దా.. పోలీసులకు విద్యార్థి దిమ్మతిరిగే ప్రశ్న

ప్రస్తుతం తన మొత్తం ఆస్తుల విలువ రూ.95,98,053గా యోగి పేర్కొన్నారు. 2014 లోకసభ ఎన్నికల నాటికి ఆయన ఆస్తులు రూ.72,17,674 ఉన్నాయి. ఈ మూడేళ్లలో 23.80 లక్షల మేర ఆయన ఆస్తులు పెరిగాయి.

Value of Yogi Adityanath's assets increased by 32 per cent in 3 years

ఇందులో 20 గ్రాముల చెవిదుద్దులు (రూ.49వేలు), పది గ్రాముల బంగారం గొలుసు (రూ.26వేలు) ఉన్నాయి. దీంతో పాటు ఆయనకు ఒక రివాల్వర్‌ (రూ.లక్ష), ఒక రైఫిల్‌ (రూ.80వేలు) ఉన్నాయి. ఐదు సార్లు లోకసభకు ఎన్నికైన యోగి తనకు లోకసభ ఎంపీగా లభించే భృతి మాత్రమే ఏకైక ఆదాయ మార్గమన్నారు.

ఆదిత్యనాథ్‌, ఆయన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ తన ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఎం. రజా, స్వతంత్రదేవ్‌ సింగ్‌లు మండలి ఉప ఎన్నికలకు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారివారి ఆస్తులు వివరాలు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+