వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్ ఫస్ట్ జర్నీ డేట్ ఇదే.. టికెట్ రేట్ ఎంతంటే!

మనమంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్ గురించి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ స్లీపర్ ట్రైన్ ఫస్ట్ జర్నీ గురించి అధికారిక ప్రకటన చేశారు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. గురువారం వెల్లడించిన సమాచారం మేరకు ఈ ట్రైన్ కు తొలి గ్రీన్ సిగ్నల్ వెలగబోయే ప్రాంతం బహిర్గతమైంది. ట్రైన్ ప్రారంభోత్సవం, తొలి ప్రయాణం, టికెట్ ధర వంటి కీలక అప్డేట్స్ ఈ కథనంలో

దేశంలో వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుంది. రోజురోజూకు వందే భారత్ ఎక్కేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో వందే భారత్ ట్రైన్స్ స్పీడ్ కూడా ఇటీవల రికార్డ్ నెలకొల్పింది. ఇటీవలఈ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్లో ఉంచినా.. టాప్ స్పీడ్ రీచ్ అయినప్పడు ఏమాత్రం కదలకుండా ఉంది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను పంచుకున్నారు.

సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు గురించి గురువారం కీలక ప్రకటన చేశారు. ముందుగా ఈ ట్రైన్ కోల్‌కతా- గువాహటిల మధ్య పరుగులు పెట్టబోతుందని తెలిపారు. జనవరి 18-19 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశం ఉందన్నారు. పశ్చిమబెంగాల్‌- అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్‌ ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగానే నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే ఈ ఏడాదిలో అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిష్టాత్మక రైలును ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారనే టాక్ నడుస్తుంది.

Vande Bharat sleeper to be launched in January Ashwini Vaishnaw announces route amp amp fares

టికెట్ ధరలు..

ప్రస్తుతం కోల్‌కతా - గువాహటి నగరాల మధ్య ఫ్లైట్ టికెట్ రూ.6 వేలు నుంచి 8 వేలుగా ఉంటుంది. అయితే ఫ్లైట్ రేట్ లో సగం ధరకే వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో 3 ఏసీలో టికెట్‌ ధర(ఆహారంతో కలిపి సుమారు రూ.2,300 గా ఉండవచ్చని అంటున్నారు. ఇక 2ఏసీ ధర సుమారు రూ.3000, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉండొచ్చని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+