Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vande bharat sleeper train: పడుకుని విలాసంగా ప్రయాణించేందుకు రెడీ అవ్వండి!

వందే భారత్ ఎక్స్ ప్రెస్.. భారతదేశంలో రైలు ప్రయాణ రూపు రేఖలను మారుస్తున్న రైలు. ఇక అధునాతన వందే భారత్ స్లీపర్ రైళ్ళు మరింత సుఖవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించటానికి అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మొదట ఎనిమిది కోచ్ లతో మొదలై 24 కోచ్ లకు పెరిగింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతుంది.

వందే భారత్ స్లీపర్ రైళ్ళపై కేంద్ర మంత్రి ప్రకటన
త్వరలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలు పడుకుని ప్రయాణించే విలాసవంతమైన, అధునాతనమైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించనుంది. ఈ క్రమంలో వందేభారత్ స్లీపర్ రైళ్ల పైన రాజ్య సభ వేదికగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, అనేక ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Vande Bharat sleeper train which offers luxurious sleeper travel will arrive soon railway minister key announcement

Take a Poll

వందే భారత్ స్లీపర్ రైళ్ళ డిజైన్ ఖరారు
త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతాయని పేర్కొన్నారు. రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో త్వరలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్న ఆయన, వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. భారతీయ రైల్వేలు తయారు చేయనున్న వందే భారత్ స్లీపర్ రైళ్ల డిజైన్లను కూడా ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.

రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ రైళ్ళ వివరాలివే
ప్రస్తుతం 10 వందే భారత స్లీపర్ రైళ్లను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మరో 50 వందే భారత స్లీపర్ రైళ్లు తయారవుతున్నాయని, ఇవి కాకుండా 200 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు టెక్ భాగస్వాములతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.

త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్ళు
KINET రైల్వే సొల్యూషన్స్ లిమిటెడ్ ఒక్కొక్కటి 16 కోచ్‌లతో 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందించనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఇదిలా ఉంటే దేశంలోనే మొదటి సెమీ హై స్పీడ్ రైలు అయినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఫిబ్రవరి 15 2019 భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా, ప్రస్తుతం వందే భారత్ రైళ్ళు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఇక త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్ళు రానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+