పట్టాలెక్కిన వందేభారత్ స్లీపర్, 180 కిమీ వేగం - వీడియో..!!
భారతీయ రైల్వేలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతోంది. దేశంలో తొలిసారి వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కుతున్నాయి. ఈ దిశగా కసరత్తు వేగవంతం అయింది. వేగం నిర్ధారించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన పరీక్షలో వందేభారత్ స్లీపర్ రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణం కు సంబంధించి ఆసక్తికర వీడియో పోస్టు చేసారు.
వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కింది. తాజా పరీక్షలో ఈ రైలు గంటకు 180 కిమీ వేగంతో దూసుకె ళ్లింది. ఇంత వేగంగా వెళ్తున్న సమయంలోనూ ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో ఈ పరీక్షలు నిర్వహించారు. వందేభారత్ స్లీపర్ తొలుత జనవరిలో నిర్వహించిన పరీక్షలో గంటకు 130 కిమీ వేగంతో నడిపి చూసారు. ఆ తరువాత ఆ వేగాన్ని క్రమేణా పెంచుతూ పరీక్షలు నిర్వహించారు. తాజాగా 180 కిమీ వేగంతో రైలు నడిపారు. రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కి.మీ/గంట వేగంతో దూసుకెళ్లింది.

Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
ఆ సమయంలో రైలు మొత్తం ప్రయాణీకులు.. వారి లగేజి ఉంటే ఎంత మేర బరువు ఉంటుందో అదే స్థాయిలో సమం చేసేలా బరువు రైలులో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీనిని పరీక్షించారు. మరిన్ని ట్రాక్ ల పైన పరీక్షాంచాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ రైలు దేశ వ్యాప్తంగా అందుబాటు లోకి రానుంది. ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయని అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ(ఎస్ఎల్ఆర్) కోసం 2 బోగీలు ఉంటాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ దూసుకెళ్తున్న రైలు వీడియో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications