రాజస్తాన్ రాజకీయాల్లో సైలంట్‌గా వసుంధర రాజే, సోషల్ మీడియాకు కూడా, కారణమిదేనా..?
రాజస్తాన్ సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతోన్నాయి. బయటకి ఆత్మభిమానం, ఆత్మగౌరవం అని అంటోన్న.. లోన మాత్రం ముఖ్యమంత్రి పీఠం. సచిన్ పైలట్ తిరుగబాటుకు కూడా కారణం అదే, అంతేకాదు సచిన్ ధిక్కార స్వరం తర్వాత అతనితో బీజేపీ సంప్రదింపులు జరిపిందని వార్తలొచ్చాయి. అతను సీఎం పోస్టు అడగడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వసుంధర రాజేని కాదని బీజేపీ హై కమాండ్ ఏం చేయలేని పరిస్థితి. దీనిని బీజేపీ ఉద్దండ నేతలు కూడా అంగీకరించాల్సిందే. బీజేపీకి ఉన్న 73 మంది ఎమ్మెల్యేలలో 45కి పైచిలుకు రాజే కనుసన్నల్లో పనిచేసేవారు. అందుకే బీజేపీ సైలంట్‌గా ఉంది.

సైలంట్‌గా రాజే.. కారణమిదే..?
బీజేపీతోపాటు రాజే కూడా సైలంట్‌గా ఉన్నారు. ఎందుకంటే పైలట్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తే.. తనకే మేకై కూర్చొంటాడని భావిస్తోన్నారు. అందుకే బీజేపీ అధికారం చేపట్టేందుకు అడుగులు వేయడం లేదు. గెహ్లట్‌కు కాస్త అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని బలపరుస్తూ బీజేపీ మిత్రపక్ష ఎంపీ హనుమాన్ ట్వీట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిస్తున్న రాజే ప్రవర్తన కూడా ఉంది. కాంగ్రెస్ పరిణామాలపై ఆమె నోరు మెదపడం లేదు. బహిరంగంగా మాట్లాడకున్నా సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయడం అనుమానాలు నిజమేనని అనిపిస్తోంది.

మిగతా నేతలు.. మాత్రం
రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతోన్న పరిమాణాలను ఫైర్ బ్రాండ్ రాజే కాకుండా.. మిగతా నేతలు మాత్రం స్పందిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఓం మాథుర్, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు గెహ్లట్ ప్రభుత్వానికి మద్దతు లేదని, బల నిరూపించుకోవాలని కూడా కోరడం లేదు. ఇందుకు కూడా వసుంధర.. గెహ్లట్ ప్రో ఉండటమే కారణం. పైలట్ కన్నా గెహ్లట్‌కు మద్దతిచ్చి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని వసుంధర భావిస్తోంది.

గెహ్లట్ ఫినిష్..
మిగతా నేతలు మాత్రం అశోక్ గెహ్లట్ ప్రభుత్వం పని అయిపోయిందని చెబుతున్నారు. రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వం పతనం దశకు వచ్చిందని తెలిపారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజే మాత్రం.. సైలంట్‌గా ఉన్నారు. ఈ విషయం బీజేపీ పెద్దలకు తెలిసినా.. మెజార్టీ ఎమ్మెల్యేలు రాజే పక్షాన నిలవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
Recommended Video

రాజే కనుసన్నల్లో
రాజస్తాన్‌లో బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 45 మంది వరకు రాజేను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలే.. వారిని కాదని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. అందుకోసం బీజేపీ మిన్నకుండిపోగా.. రాజే కూడా సచిన్ పైలట్ కాకుండా గెహ్లట్ ప్రభుత్వం కంటిన్యూ అయ్యేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని మీడియా కోడై చూస్తుంది. వాస్తవానికి రాజే కూడా రాజస్తాన్ ప్రభుత్వ సంక్షోభంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications