అంతా మృతి: కుటుంబంలో మిగిలింది ఒక్కడే!

రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గోదావరిలో పడిన తుఫాన్‌ వాహనం ప్రమాద ఘటనలో అప్పారావు కుటుంబంలో 22 మంది మృత్యువాత పడగా, ఒక్క బాలుడు మాత్రమే బతికి బయటపడ్డాడు. ఈగ అప్పారావు కుటుంబంలో కిరణ్‌సాయి అనే 8 ఏళ్ల బాలుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. అతన్ని రాజమండ్రి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రమాదం గురించి ఆ బాలుడిని అడిగితే, తన వారంతా మరణించడంతో భయం భయంగా, ఆందోళనగా కనిపించాడు. ప్రమాదం తర్వాత తన అక్క దాహమంటూ అరుస్తుంటే, తాను కనీసం నీళ్లివ్వలేక పోయానని కిరణ్‌ విలపిస్తూ చెప్పాడు. ప్రమాదం అనంతరం తాను తల్లిదండ్రులతోపాటు తన బంధువులతో మాట్లాడదామని తడిమి చూశానని చెప్పాడు.

 Vehicle plunges intio Godavari river: Only one boy escaped

వారెవరూ మాట్లాడలేక పోయారని బాలుడు కిరణ్‌ చెప్పాడు. ఈ ఉదంతం అందరినీ గుండెను మెలిపెట్టింది. అసలు ప్రమాదం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారాక ఆరుగంటల సమయంలో వాకింగ్‌ వచ్చిన వారు గమనించి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.

విశాఖ వెళ్లేందుకు హైవే మార్గం ఉన్నా దగ్గర దారి అని ధవళేశ్వరం మీదుగా బ్యారేజ్‌ మీదకు వచ్చి ప్రమాదం బారిన పడి గోదావరి పాలయ్యారని స్థానికులు ఆవేదనగా చెప్పారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ నుజ్జునుజ్జు కాగా, వ్యాన్‌ ఉన్న వారిలో ఒక్క బాలుడు మినహా అందరూ మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+