వీహెచ్‌పీ సంచలన ప్రకటన..! మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు.. కానీ...

మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని విశ్వహిందూ పరిషత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ కేంద్ర కమిటీ సమావేశంలో సంఘం జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మతాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే లవ్ జిహాద్ మాత్రం కచ్చితంగా వ్యతిరేకిస్తామని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ పై ఉద్యమిస్తోంది విశ్వహిందూ పరిషత్. హిందూ యువతను ప్రేమ పేరిట ముస్లిం యువకులు ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నారంటూ దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ లవ్ జిహాద్ పేరుతో ముస్లిం యువకులు పెళ్లి చేసుకోవడాన్ని మాత్రం తాము వ్యతిరేకించి తీరుతామని పేర్కొంటున్నారు. తాము మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని చెప్తూనే, ముస్లిం యువకులు హిందూ యువతను ప్రేమ పేరుతో పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం ఊరుకోమని తెగేసి చెబుతున్నారు. ఇది కేవలం ముస్లింలు, హిందూ యువతను మతం మార్చే క్రమంలో చేస్తున్న ఒక కుట్ర అని వారు భావిస్తున్న నేపథ్యంలోనే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

VHP sensational statement ..! Not against interfaith marriages .. but ...

ఇప్పటికే దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ పేరుతో ఎక్కడ ఏ సంఘటన జరిగినా విశ్వహిందూ పరిషత్ నేతలు స్పందిస్తున్నారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము వ్యతిరేకించేది లవ్ జిహాద్ మాత్రమేనని, మతాంతర వివాహాలను కాదని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ఇక అంతే కాదు ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేయాలని, కాశ్మీరీ పండిట్ లకు జమ్మూకాశ్మీర్లో పునరావాసం కల్పించాలని కూడా జమ్మూలో నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా వినోద్ బన్సాల్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+