Allahabad High Court:అత్యాచార బాధితురాలికి గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉంది..
Allahabad High Court: లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల సందర్భంలో ఒక మహిళ తన గర్భాన్ని రద్దు చేసుకోకుండా అడ్డుకోవడం, ఆమెను మాతృత్వ బాధ్యతకు బంధించడం అంటే ఆమె గౌరవంగా జీవించే మానవ హక్కును హరించడమే అవుతుందని పేర్కొంది. తల్లి కావడానికి అవును లేదా కాదు అని చెప్పే హక్కు మహిళకు ఉందని కోర్టు తెలిపింది. బాధితురాలికి వైద్యపరంగా గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇస్తూ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది.
మైనర్ కావడంతో..
భడోహికి చెందిన 17 ఏళ్ల బాలిక తండ్రి తన మైనర్ కుమార్తెను ప్రలోభపెట్టి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడనే ఆరోపణలపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. పోలీసులు కూతురిని వెతికి ఆమె తండ్రికి అప్పగించారు. ఈ సమయంలో బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె 15 వారాల గర్భవతి అని తేలింది. దీనిపై బాధితురాలి తండ్రి మైనర్ తరపున గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది మన్మోహన్ మిశ్రా వాదిస్తూ, పిటిషనర్ పై అనేకసార్లు అత్యాచారం జరిగిందని అన్నారు. ఆమె ఇప్పుడు గర్భవతి అని పేర్కొన్నారు. ఇది ఆమె మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని వాదనలు వినిపించారు. పిటిషనర్ మైనర్ కావడంతో పిల్లల బాధ్యతను కోరుకోవడం లేదని కోర్టుకు తెలిపారు.

కోర్టు అనుమతి
బాధితురాలు లైంగిక వేధింపులు లేదా అత్యాచారాలకు గురైనా లేదా మైనర్ అయినా.. 24 వారాల వరకు గర్భాన్ని తొలగించే నిబంధన 2021 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ ప్రకారం ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యపరంగా గర్భస్రావం చేసుకోవడానికి సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులు అనుమతించాయని ఉదాహరణను ప్రస్తావిస్తూ.. గర్భస్రావానికి అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్బగా లైంగిక వేధింపుల కారణంగా గర్భం దాల్చిన బిడ్డను ఉంచుకోవడం లేదా వద్దునుకునే హక్కు బాధితురాలికి ఉంటుందని కోర్టు పేర్కొంది. బాధితురాలు తన తల్లి లేదా సంరక్షకుడితో జిల్లా ఆస్పత్రికి వెళ్లొచ్చని కోర్టు పేర్కొంది. వైద్య పరమైన అడ్డంకులు లేకండా గర్భస్రావం జరిగేలా చూడాలని జిల్లా వైద్య అధికారిని కూడా ఆదేశించారు. అన్ని వైద్య సదుపాయాలను ఉచితంగా అందించాలని.. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే పిండం కణజాలాలను, రక్తనమూనాలను భద్రపరచాలని కోర్టు సూచించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications