డేరా బాబా రాసలీలలు: పక్కన రివాల్వర్, నీలి చిత్రాలు చూస్తూ...

కృష్ణుడి పేరుతో మహిళలను మోసం చేసిన డేరా సచ్చా సౌదా చీప్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాడు.

పంచకుల: కృష్ణుడి పేరుతో మహిళలను మోసం చేసిన డేరా సచ్చా సౌదా చీప్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాడు. అతని రాసలీలలను వివరిస్తూ ఓ బాధితురాలు రాసిన లేఖ సారాంశంతో ఓ వార్తాకథనం మీడియాలో వచ్చింది.

ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది. 2002లో డేరా బాబా బాధితురాలైన ఓ సాధ్వి (బాబా భక్తురాలు) తన పేరు బయటపెట్టకుండా లేఖ రాసింది. ఆ లేఖలోని విషయాలు సిబిఐ దర్యాప్తునకు దారి తీసేలా చేశాయి.

'శ్రీకృష్ణుడికి 360 మంది గోపికలున్నారు. వారిని ప్రతిరోజూ ఆయన ప్రేమిస్తుంటాడు. ఇప్పటికీ ఆయనను ప్రజలు దేవుడుగా కొలుస్తారు. అందువల్ల ఇదేం కొత్త కాదు' అంటూ తనను డేరా బాబా లొంగదీసుకున్నట్టు బాధితురాలు ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ లేఖను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, అప్పటి పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది.

దిండు పక్కన రివాల్వర్...

దిండు పక్కన రివాల్వర్...

బాధితురాలు ఆ లేఖలో తనను తాను పంజాబ్ నుంచి వచ్చిన మహిళగా చెప్పుకుంది. తన కుటుంబ సభ్యులు గుర్మీత్ పరమవీర భక్తులు కావడంతో తాను కూడా సాధ్విగా (మహిళా భక్తురాలిగా) మారినట్టు చెప్పింది. సిర్సా ఆశ్రమానికి వచ్చి అప్పటికి రెండేళ్లు అయిందని, బాబా శిష్యురాలిని కావడం తన అదృష్టంగా భావించేదాన్నని చెప్పింది.

Recommended Video

    Gurmeet Case Started With An Anonymous Letter నీలి చిత్రాలు చూస్తూ మూడేళ్ల పాటు అత్యాచారం...
    ఇలా చేశాడు...

    ఇలా చేశాడు...

    ఆ తర్వాత ఓ రోజు గుర్మిత్ సింగ్ తన గుఫ (ప్రత్యేక మందిరం)లోకి రావాలని పిలవడంతో తాను వెళ్లినట్టు చెప్పింది. అప్పుడు రాత్రి 10 గంటలు అవుతోందని, తాను గుఫలోకి అడుగుపెట్టానని, మంచం మీద మహరాజ్ కూర్చుకున్నారుృని, టీవీ రిమోట్ ఆయన చేతిలో ఉందని చెప్పింది. ఆయన నీలిచిత్రం ఒకటి చూస్తున్నారని, ఆయన దిండు పక్కన ఒక రివాల్వర్ ఉందని, ఆయనను ఆ విధంగా చూసి షాక్‌కు గురయ్యానని ఆమె వివరించింది. ప్రియమైన సాధ్విగా అనుగ్రహించేందుకు తననుఎంపిక చేసినట్టు మహరాజ్ తనతో చెప్పాడని ఆ సాధ్వి తెలిపింది.

    నేనే దేవుడిని...

    నేనే దేవుడిని...

    మహరాజ్ ప్రసాదిస్తానన్న అనుగ్రహాన్ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె ఆ లేఖలో తెలిపింది. "నేనే దేవుణ్ణి. నీకెలాంటి సందేహం అక్కర్లేదు" అని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. దేవుడు ఇలాంటి పనులు చేస్తాడా తాను ప్రశ్నించానని అన్నది. దాంతో "ఇదేమీ కొత్త కాదు. కృష్ణ భగవానుడు తన 360 మంది గోపికలను రోజూ ప్రేమిస్తూనే ఉండేవాడు. ప్రజలు ఇప్పటికీ ఆయనను దేవుడిగా ఆరాధిస్తూనే ఉన్నారు కదా" అని మహరాజ్ జవాబిచ్చారని అన్నది. తన కోరిక తీర్చకుంటే ఆశ్రమంలోని తన కుటుంబ సభ్యులను బయటకు గెంటేస్తానని కూడా ఆయన బెదరించారని లేఖలో రాసింది.

    మూడేళ్ల పాటు అత్యాచారం...

    మూడేళ్ల పాటు అత్యాచారం...

    ఆ తర్వాత గుర్మీత్ తనపై మూడేళ్ల పాటు అత్యాచారం చేస్తూ వచ్చాడని బాధితురాలు తెలిపింది. తనతో పాటు పలువురు సాధ్వీలు ఆయన బారిన పడ్డారని, వారంతా 35 నుంచి 40 ఏళ్ల ప్రాయంలోని వారేనని తెలిపింది. వారు పెళ్లి వయస్సు దాటిన వారే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాబాకు లొంగిపోవాల్సి వచ్చేదని ఆమె చెప్పిది. ఒకవేళ ఎవరైనా ఎదురుతిరిగితే వారిని డేరా ఆశ్రమంలోపలే వేధించేవారని, కొట్టేవారని చెప్పింది.

    ప్రాణభయంతోనే...

    ప్రాణభయంతోనే...

    పేరు చెప్తే చంపేస్తారనే భయంతోనే తన పేరు వెల్లడించడం లేదని ఆ సాధ్వి తన లేఖలో చెప్పింది. బాధిత మహిళలను అడిగి తెలుసుకుంటే వారు అన్ని విషయాలూ పూస గుచ్చినట్టు చెబుతారని, వైద్య పరీక్షలు జరిపితే మీకూ, మా కుటుంబసభ్యులకు మేము కన్యలమా కాదా, మా జీవితాలు ఎలా ధ్వంసమయ్యాయనేది తెలుస్తుందని అన్నారు.

    ఇలా చేశారు...

    ఇలా చేశారు...

    బాధితురాలి ఫిర్యాదును సుమోటోగా అప్పటి పంజాబ్, హర్యానా హైకోర్టు జస్టిస్ట్ ఆదర్శ్ కుమార్ గోయెల్ స్వీకరించారు. డేరాను సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా, సెషన్స్ జడ్జిని ఆదేశించారు. ఆ నివేదిక రావడంతో 2002 సెప్టెంబర్ 24న సీబీఐ దర్యాప్తునకు జస్టిస్ గోయెల్ ఆదేశించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+