వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ప్రతీకారం: పాకిస్థాన్ ఆయుధ బంకర్లు ధ్వంసం, 11 మంది పాక్ సైనికులు హతం(వీడియో)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సరిహద్దులో పాకిస్థాన్ గత కొంత కాలంగా తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే కాల్పులకు తెగబడుతోంది. తాజాగా, నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లతోపాటు ముగ్గురు పౌరులు మరణించారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ విదేశీ కార్యాలయం పాక్‌లోని భారత దౌత్యాధికారికి నోటీసులు పంపింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ బాబార్ ఇఫ్తికార్ మరియు విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీలు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఉన్నతాధికారులను కలవాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

8 మంది పాక్ సైనికుల హతం

అంతేగాక, పాకిస్థాన్‌లోని ఆయుధ బంకర్లను నాశనం చేసింది. ఈ బంకర్ల ధ్వంసానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఆయుధ బంకర్లతోపాటు చమురు నిల్వల గిడ్డంగులను కూడా, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి భారత భద్రతా బలగాలు. దవార్, నౌగమ్, యూరీ, కేరన్ సెక్టార్లలో భారత బలగాలకు, పాకిస్థాన్ రేంజర్లకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. భారత దళాల కాల్పల్లో 11 మంది పాక్ సైనికులు హతమయ్యారు.

పాక్ ఆయుధ బంకర్లు నేలమట్టం..

పాక్ కాల్పులు నేపథ్యంలో భారత్ స్వల్ప దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగించే వీలున్న క్షిపణులతో పాక్ ఆయుధ బంకర్లను నేలమట్టం చేశాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. భాతర బలగాలు వారికి ధీటుగా బదిలిస్తున్నారు.

Recommended Video

Faulty Chinese Military Equipment NEWS | Oneindia Telugu

పాక్ కాల్పుల్లు ఆరుగురు మృతి

పాకిస్థాన్ బలగాలు జరిపిన భారీ దాడుల మధ్య ఇద్దరు ఆర్మీ జవాన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారి మృతి చెందారు. అదే ప్రాంతంలో ముగ్గురు పౌరులు మరణించారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ షెల్లింగ్‌లో సరిహద్దు వెండి ఉన్న పలు పౌరుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, పూంచ్ జిల్లాలోని సాజియాన్‌లో పాక్ షెల్లింగ్‌లో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. షెల్లింగ్‌కు భారత బలగాలు తీవ్ర ప్రతీకారం తీర్చుకున్నాయని, పాకిస్థాన్ వైపున కూడా భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

English summary
In Video, Indian Missiles, Rockets Score Direct Hits On Pak Bunkers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X