విజయ్‌ ఓటమి ఖాయం! రెండు చోట్లా నిరాశే? తేల్చేసిన సర్వే

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆశించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మొదటి ఎన్నికల్లోనే చుక్కెదురు కానుందా? తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. Civicpoll Analysis Committee (C-PAC) విడుదల చేసిన 2026 అసెంబ్లీ నియోజకవర్గాల వారీ అంచనాల ప్రకారం.. విజయ్ పోటీ చేస్తున్న కీలక స్థానాల్లో ఆయనకు ఓటమి తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

C-PAC వెల్లడించిన గణాంకాల ప్రకారం, అత్యంత ఆసక్తికరమైన పోరు సాగుతున్న పెరంబూర్ నియోజకవర్గంలో DMK పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ TVK ప్రభావం చూపలేకపోయిందని, ఓటర్లు మరోసారి అధికార పక్షం వైపు మొగ్గు చూపారని అంచనా. అలాగే, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా విజయ్‌కు నిరాశే ఎదురుకానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక్కడ AIADMK పార్టీ జెండా ఎగురవేయబోతున్నట్లు సమాచారం.

Vijay Faces Defeat CPAC Exit Poll Predicts TVK Leader Might Lose in Perambur and Trichy East Constituencies
విజయ్ పార్టీ ఆఫీసుకు నిప్పుపెట్టిన దుండగులు.. సీసీ టీవీ ఫుటేజ్
విజయ్ పార్టీ ఆఫీసుకు నిప్పుపెట్టిన దుండగులు.. సీసీ టీవీ ఫుటేజ్

షోలింగనల్లూర్, మైలాపూర్‌లో మాత్రమే ఆశలు!

మరోవైపు, TVK పార్టీకి కొన్ని చోట్ల ఊరట లభించే అవకాశం ఉంది. షోలింగనల్లూర్, మైలాపూర్ నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు C-PAC అంచనా వేసింది. అయితే, పార్టీ అధినేతగా కీలకమైన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ వంటి స్థానాల్లో ఓటమి పాలైతే.. అది పార్టీ భవిష్యత్తుపై, విజయ్ రాజకీయ ప్రస్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుక్కపెట్టి ఏడుస్తున్న విజయ్ ఫ్యాన్స్.. షాకిచ్చిన సర్వేలు
గుక్కపెట్టి ఏడుస్తున్న విజయ్ ఫ్యాన్స్.. షాకిచ్చిన సర్వేలు

మొత్తం మీద, ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు విజయ్ అభిమానులను కలవరానికి గురిచేస్తుండగా, ప్రధాన పార్టీలైన DMK, AIADMK తమ పట్టును నిలబెట్టుకోవడంలో సఫలమైనట్లు కనిపిస్తోంది. తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+