ఆయనకు నా అవసరం లేదు- ఓపెన్‌గా తేల్చేసిన ప్రశాంత్ కిశోర్..

Thalapathy Vijay: తమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రానికి ఏడాది పూర్తయింది. గత ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. సంచలనాలకు తెర తీశారు.

సౌతిండియన్ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులు ఉన్న రజినీకాంత్ చేయలేని పనిని విజయ్ సాధించినట్టయింది. రాజకీయాల్లో అడుగు పెట్టే సాహసానికి పూనుకున్నట్టయింది. కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు.

Vijay is the new hope for Tamil Nadu says Prashant Kishor during TVK anniversary meeting

బహుభాషా నటుడు కమల్ హాసన్.. మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఇప్పుడా జాబితాలో చేరిన విజయ్.. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తమౌతోన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కొత్త సినిమాలనేవీ చేయట్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో జన నాయగన్ అనే మూవీ ఒక్కటే ఉంది.

నేడు తొలి వార్షికోత్సవ సభ చెన్నై శివార్లలోని మామళ్లాపురంలో ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజయ్ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. అదే సమయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని సైతం కొనసాగిస్తోన్నారు. రికార్డు స్థాయి సభ్యత్వాలపై దృష్టి పెట్టారు.

ఈ సభకు హాజరయ్యారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్. సభలో ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ఎలా రావాలనేది రాజకీయ వ్యూహకర్తల చేతుల్లో ఉండబోదని, పార్టీ నాయకులు, కార్యకర్తల అంకితభావం మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు.

వ్యూహకర్తలకు జయాపజయాలతో ఎలాంటి సంబంధం ఉండదని, అంతా నాయకులు, కార్యకర్తలు చేసే పనులతో ముడిపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాల కిందటే అంటే 2021లోనే వ్యూహకర్తగా రిటైర్మెంట్ ప్రకటించానని తేల్చి చెప్పారు ప్రశాంత్ కిశోర్. చివరిసారిగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో పని చేశానని గుర్తు చేశారు.

వ్యూహకర్తగా రిటైర్మెంట్ అయినప్పటికీ ఈ సభలో పాల్గొనడానికి కారణాలు లేకపోలేదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. టీవీకే కోసం వ్యూహకర్తగా, విజయ్‌కు సహాయం చేయడానికి తాను ఇక్కడికి రాలేదని తేల్చి చెప్పారు. దళపతి విజయ్‌కు తన అవసరం లేదని, ఆ మాటకొస్తే ఎవరి వ్యూహాలు అక్కర్లేదని పేర్కొన్నారు.

వ్యూహకర్తగా రిటైర్మెంట్ ప్రకటించినందున ఏ నాయకుడితో లేదా పార్టీతో కలిసి పనిచేయదలచుకోలేదని, అలా భావించడం వల్లే ఓ స్నేహితుడిగా ఆయన ఆహ్వానం మేరకు టీవీకే వార్షికోత్సవ సభకు హాజరయ్యానని అన్నారు. విజయ్ రాజకీయ నాయకుడు కాదని, తమిళనాడుకు ఓ కొత్త ఆశ అని అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+