విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టు
బ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. తన ఆస్తులను అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై స్టే ఇవ్వాలని తను అప్పీలు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలన్న మాల్యా అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. కేసు విచారణను 5 ఫిబ్రవరికి వాయిదా వేసింది.
కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో ఆర్థిక నేరగాళ్లకోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో తొలి ఆర్తిక నేరస్తుడిగా విజయ్ మాల్యా నిలిచాడు. ఆర్థిక నేరగాళ్ల కోసం కొత్త చట్టాన్ని ప్రభుత్వం గతేడాది ఆగష్టులో తీసుకొచ్చింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఆయన కేసులను విచారణ చేస్తున్న ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. కేసును విచారణ చేసిన ప్రత్యేక కోర్టు ఈడీ పెట్టిన అప్లికేషన్‌కు అనుకూలంగా విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించి అతని ఆస్తులను స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా వెస్ట్‌మిన్స్‌టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిసెంబరులో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వచ్చే వరకు మాల్యా బెయిల్‌పైనే తిరిగే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా యూకేకు 2016లో మాల్యా పారిపోయారు. దీనిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications