ముందు త్రిష సంగతి ఏమిటో తేల్చండి: విజయ్ పై BJP చీఫ్ సంచలన కామెంట్స్..!!

మరో రెండు నెలల్లో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి.నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి హీట్ పెరిగిపోయింది.తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తమిళ నటుడు-టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపంనలు సృష్టిస్తున్నాయి. విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకీ నైనార్ నాగేంద్రన్ ఏమన్నారు..?

త్రిషతో విజయ్‌ని ముడిపెడుతూ...

ఇంకా వేసవికాలం రాకముందే తమిళనాడు రాజకీయాలు రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిలా మారుస్తున్నాయి.త్వరలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మధ్య మాటల యుద్ధం మరో లెవెల్‌కు చేరుకుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటి త్రిషతో విజయ్‌ను ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే కార్యకర్తలు, అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. హీరోయిన్ త్రిష నుంచి విజయ్ బయటకు వస్తేనే ఏమైనా జరుగుతుందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు నాగేంద్రన్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని,రాజకీయ అనుభవాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Vijay needs to come out of Trisha Krishnan first Bjp Leader Nainar Nagendran sensational comments

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నైనార్ నాగేంద్రన్ విజయ్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు.విజయ్ రాజకీయ అనుభవాన్ని ప్రశ్నించిన ఆయన TVK ఓటు బ్యాంకు వాదనలను కొట్టిపారేయడంతో పాటు అధికార DMKపైనా విమర్శలు గుప్పించారు.మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ రాజకీయ విశ్వసనీయతను, అనుభవాన్ని నాగేంద్రన్ తనదైన శైలిలో తీవ్రంగా ప్రశ్నించారు. "పాపం విజయ్‌కి ఏమీ తెలియదు; అతనికి సున్నా అనుభవం. ముందు అతన్ని తన ఇంటి నుండి బయటకు రావాలని చెప్పండి. త్రిషతో తన సంబంధం నుండి అతను బయటపడితేనే వాస్తవాలను చూడగలడు. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ప్రయత్నించే ముందు అతను తన కుటుంబ సంబంధాలను సరిచేసుకోవాలి. తనకు కుటుంబంలో సరైన సంబంధాలను కొనసాగించాలి, గొప్ప నాయకులు ఉద్యమాలను ఎలా నిర్మించారో నేర్చుకోవాలి," అని అన్నారు.

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరనట్టు

తన వాదనను మరింత బలంగా వినిపించేందుకు నాగేంద్రన్ ఒక సామెతను చెప్పుకొచ్చారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరనట్టు ఉంది విజయ్ తీరు అంటూ సెటైర్ వేశారు. ప్రతిదానికి అనుభవం కావాలి అని చెప్పుకొచ్చిన నాగేంద్రన్ కుండలో ఏది ఉందో అదే పోయగలరు అని వ్యాఖ్యానించారు.ఓటు షేర్ గురించి TVK చేసిన వాదనలను కూడా నాగేంద్రన్ కొట్టిపారేశారు. ఒక నటుడు అయినంత మాత్రాన అతడు 32% ఓట్లను దక్కించుకుంటాడని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఒకప్పుడు విజయకాంత్ సభలకు కూడా భారీగా జనసందోహం తరలివచ్చేదని గుర్తు చేసిన నాగేంద్రన్...అవి ఓట్లుగా మార్చుకోవడంలో విజయకాంత్ విఫలమయ్యారని చెప్పారు.

మొత్తానికి తమిళనాట రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ సారి ఎన్నికలపై చాలా గట్టిగా ఫోకస్ చేసింది కమలం పార్టీ. వీలైనన్ని ఎక్కవ సీట్లపై కన్నేసింది. ఓటు శాతం కూడా ఈ సారి బీజేపీకి పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే విజయ్ పార్టీ ఎంట్రీతో ప్రధాన పార్టీలైన డీఎంకే కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే బీజేపీ కూటమిలకు చెమటలు పడుతున్నాయనేది అక్కడి అనలిస్టులు చెప్తున్నారు. విజయ్ రాకతో ఏ పార్టీకి ఓట్లు చీలుతాయో అంతు చిక్కడం లేదని పలు సర్వే సంస్థలు కూడా భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+