చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెప్టెన్ విజయకాంత్‌కు అస్వస్థత: చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక, ఐసీయూలో చికిత్స

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎండీకే అధినేత, ప్రముఖ తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

అయితే, విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగమ్(డీఎండీకే)నేతలు తెలిపారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్ళినట్లు వెల్లడించారు.విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరారు.

 Vijayakanth admitted to hospital in Chennai, DMDK claims nothing to worry

విజయకాంత్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఈ రోజు లేదా రేపు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని డీఎండీకే నేతలు తెలిపారు. అయితే, విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి మాత్రం ఎలాంటి హెల్త్ బులిటెన్ గానీ, వివరాలు గానీ వెల్లడించలేదు.

కాగా, విజయకాంత్ గత సంవత్సరం కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సాధారణంగా ఎంఐఓటీ ఆస్పత్రిలో తరచూ చెకప్ కోసం వెళ్తుంటారు. ఈ కారణంగానే ఆయన ఎక్కువగా బయట కనిపించడం లేదు. రాజకీయాల్లోకి డీఎండీకే పార్టీ స్థాపించి వచ్చినప్పటికీ.. ఆ పార్టీ ప్రభావం అంతగా చూపలేదు. అయితే, అనేక హిట్ సినిమాల్లో నటించిన విజయకాంత్.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

English summary
In the wee hours of Wednesday, actor-politician Vijayakanth was admitted to a private hospital in Chennai sending a shock wave across Tamil Nadu. According to TV reports, the health of Vijayakanth deteriorated around 2 am and he experienced difficulty in breathing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X