రాజకీయాలా లేక సినిమాలా?: కొడుకు భవిష్యత్తుపై విజయకాంత్ తర్జన భర్జన

చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఘోర ఓటమి పాలైన విజయకాంత్ ఇప్పుడు తన కుమారుడు షణ్ముఖ పాండియన్ భవిష్యత్తుపై ఏటూ తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. తండ్రి వారసుడిగా పాండియన్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని, ఇప్పటికే ప్రముఖ నేతలకు చెందిన వారసులు రాజకీయాల్లోకి వచ్చారని విజయకాంత్‌పై డీఎండీకే జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఒత్తిడి పెంచుతున్నారు.

నిజానికి ఎన్నికలకు ముందే పాండియన్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించి ఉంటే ఎన్నికల ఫలితం మరోలా ఉండేదని, ముఖ్యంగా డీఎండీకే కూటమికి మరింతగా ఓటు బ్యాంకు పెరిగి ఉండేదని ఆ పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా సరే పాండియన్‌ను పార్టీలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పజెప్పాలని వారు విజయకాంత్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. దీని వల్ల త్వరలో జరిగే స్ధానిక ఎన్నికల్లో లాభం పొందవచ్చనేది నేతల అభిప్రాయం. మరోవైపు 'సగాబ్దం' అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాండియన్, ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే, సినీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Vijayakanth dialima over his son future

చివరకు పాండియన్ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకునే బాధ్యతను తన బావమరిది ఎల్కే సుదీష్ కు విజయకాంత్ అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయకాంత్ చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకుని డీఎండీకే కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కూటమికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాకపోవడం విశేషం. చివరకు డీఎండీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న విజయకాంత్ కూడా ఓటమి పాలయ్యారు. డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు వచ్చాయి. ఓ ప్రాంతీయ పార్టీకి ఎన్నికల గుర్తు ఉండాలంటే కనీసం ఆరు శాతం ఓట్లు రావాలి.

అయితే విజయ్ కాంత్ ఆ ఓట్లు సంపాధించడంలో విఫలం అయ్యారు. అందుకు ఫలితంగా డీఎండీకే పార్టీ గుర్తును కూడా ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+