వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎంల వద్ద చాయ్, టిఫిన్లు .. ఊళ్లో వారి మాట ముచ్చట ... ఎందుకో తెలుసా ..?

|
Google Oneindia TeluguNews

హర్యానా : అక్కడ ఏటీఎంల వద్ద ఛాయ్, టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో ఊళ్లో వారు అక్కడకు చేరి మంచి, చెడు గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఎప్పుడు జనం గుమిగూడి ఉండటంతో .. అటువైపు రావడానికే దొంగలు జంకుతున్నారు. ఇటీవల ఏటీఎంల వద్ద వరుస దొంగతనాలు జరుగడంతో .. వాటిని అరికట్టేందుకు ఇలా వెరైటీగా ఆలోచన చేశారు.

దొంగలకు చెక్ పెట్టేందుకు ..?
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రయోగాత్మక చర్య చేపట్టారు. ఇటీవల జిల్లాలోని ఝజ్జర్, బహదూర్ గఢ్, బదలీలో ఏటీఎంలలో దొంగలు తెగబడ్డారు. ఇలాంటి కేసులు పెరిగిపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో వారు ఈ ఆలోచనకు కార్యరూపం దాల్చారు.

villagers offer tea, biscuite at atms

వయోవృద్ధులే టార్గెట్
ఇంటివద్ద ఉండే వయోవృద్ధులు ఏటీఎంల వద్దకు వచ్చేలా ప్రణాళిక రచించారు. అక్కడికి వచ్చవారికి టైం పాస్ కోసం టీ, మంచినీరు, బిస్కెట్లు అందజేశారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు, గ్రామ పెద్దలను ఒప్పించి .. ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ ఏటీఎంల వద్దకు జనం గుమిగూడుతున్నారు. అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటున్నారు.

villagers offer tea, biscuite at atms

రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఝజ్జర్ జిల్లాలో చేపట్టిన ఈ ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా చేపడితే బాగుంటుందనే ఆలోచన వస్తోంది. ఈ మేరకు డీజీపీకి ఝజ్జర్ ఎస్పీ కూడా సూచించారు. ఝజ్జర్ లో చేపట్టిన ఈ ఆలోచనను అమలుచేస్తే దొంగల బెడద తప్పుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
Experimental ATMs in Jhajjar district of Haryana are tea, biscuits. Recently, Jhajjar, Bahadur Gadh, Badali theft at ATMs. The elderly people planned to come to ATMs. Tea, fresh water and biscuits have been given. Bank officials and village elders have been convinced of this. The thieves are jumping to the side when they are crowded at the ATMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X