హింసాత్మక బెదిరింపులు: ఫేస్‌బుక్ పాలసీ హెడ్ అంకి దాస్ ఫిర్యాదు, ‘వాల్ స్ట్రీట్’ కథనం

న్యూఢిల్లీ: తనకు అనేక మంది నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదు స్వీకరించామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

భారత రాజకీయాలతో ముడిపడి..

భారత రాజకీయాలతో ముడిపడి..

ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన కథనం ఆధారంగా కొందరి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఫేస్‌బుక్ హేట్ స్పీచ్ రూల్స్ భారత రాజకీయాలతో ముడిపడివున్నాయి అనే కథనాన్ని ఆగస్టు 14న వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురితం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతోపాటు పలువురు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనమే కారణం..

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనమే కారణం..

బీజేపీ నేతల ఉల్లంఘనల ద్వారా ఫేస్‌బుక్ కంపెనీకి నష్టదాయకమని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించిందని అంకి దాస్.. తమ సహోద్యోగులకు తెలిపారు. అవాస్తవాలతో కూడిన అంశాలతో వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనాన్ని ప్రచురితం చేసిందని, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని అంకి దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా అనేక మంది నుంచి తనకు హింసాత్మక బెదిరింపులు వస్తున్నాయని నాలుగు పేజీల ఫిర్యాదులో అంకి దాస్ తెలిపారు. తన ఫొటోలు పెట్టి మరీ ఈ బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు.

ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఫేస్‌బుక్..

ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఫేస్‌బుక్..

కాగా, తాము ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు నెరపడం లేదని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఫేస్‌బుక్.. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తోందని పనిచేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం, ఇంటర్నేషనల్ డైలీ వరల్డ్ స్ట్రీట్ జర్నల్‌లో ఈ మేరకు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. తమకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని, రాజకీయ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి. ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

విచారిస్తామంటూ.. శశిథరూర్..

విచారిస్తామంటూ.. శశిథరూర్..

‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌'లో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తుందని తెలిపింది. ‘నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిశీలిస్తాను, కమిటీ ఫేస్‌బుక్ అభిప్రాయాలను కోరుతుంది' అని కమిటీ చైర్మన్ శశి థరూర్ మీడియాకు చెప్పారు. ఈ కమిటీ సెక్రటేరియట్ తన వివరణ కోరుతూ సోమవారం ఫేస్‌బుక్‌కు లేఖ రాస్తుందని, సోషల్ మీడియా సంస్థను కూడా పిలిపించే అవకాశం ఉందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+