వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:సారూ.. ఏందిదీ, ఊరివాళ్లతో అలాగేనా ప్రవర్తించేది..? దూషించి మరీ.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడు పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అంతా సెట్ రైట్ అవుతుంది. ఆఫీసులు ఓపెన్ కావడం.. మార్కెట్ కూడా గతంలో మాదిరిగా నడుస్తోంది. అయితే దినసరి కూలీలకు.. ప్రభుత్వం అందజేసే రేషన్ ఇంపార్టెంట్.. దాంతో వారి జీవనం కొనసాగుతోంది. అయితే కొందరు.. రేషన్ డీలర్లు చేసిన తప్పులకు మిగతా వారు (రేషన్ కార్డుదారులు) నష్ట పోవాల్సి వస్తోంది. అన్నీ చోట్ల కాదు.. కొన్ని చోట్ల తనిఖీ చేసి.. లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో అక్కడున్న అర్హుల సంగతి ఏంటీ.. ఇదే విషయంపై బీహర్‌లో ఆందోళనకు దిగారు. తమ సమస్యను సబ్ డివిజనరల్ మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. కానీ ఆయన పట్టనట్టు వ్యవహారించడమే కాదు.. అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో విస్తుపోవడం వారి వంతయిపోయింది. దీనిని కొందరు వీడియో తీసి షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఘటనపై సీఎం కార్యాలయం కూడా స్పందించింది.

అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే..


మొరాదాబాద్‌లో గల తీవార్ ఖాస్ గ్రామంలో మొహ్మద్ రిజ్వాన్‌కు రేషన్ షాపు ఉంది. అయితే అతను ప్రభుత్వం నిర్ధారించిన దాని కన్నా తక్కువ రేషన్ ఇస్తున్నారట. ఇటీవల ఎస్డీఎం తనిఖీ చేయగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అతని లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఇదీ విషయం.. కానీ దీంతో ఆ ప్రాంతంలో ఉండే అర్హులకు నష్టమే జరుగుతుంది. తమ రోజువారీ రేషన్ ఎలా తీసుకోవాలని వారు అంటున్నారు. దూరం వెళ్లి తీసుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఇదే విషయం ఎస్డీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆదివారం కార్యాలయానికి వచ్చారు. మెమోరాండం ఇచ్చి.. ప్రాబ్లమ్ చెప్పుదామని అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. వచ్చిన వారిని ఎస్డీఎం ఘాన్‌శ్యామ్ వర్మ దూషించారు. దీంతో నోరెళ్లబెట్టడం వారి వంతయిపోయింది.

100 మంది వరకు గ్రామస్తులు రాగా..

100 మంది వరకు గ్రామస్తులు రాగా..

సమస్యను చెప్పుకునేందుకు వంద మంది వరకు వచ్చారు. వాస్తవానికి తాము ఆందోళన చేయలేదని వారు అంటున్నారు. కానీ రేషన్ డీలర్ తన మద్దతుదారులతో రాస్తారోకో చేయించారని ఎస్డీఎం అంటున్నారు. ఎస్డీఎం తమను అసభ్య పదజాలంతో దూషించారని.. ఆ వీడియోను జనం చూపిస్తున్నారు. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది.. తెగ వైరల్ అవుతుంది. కానీ తననే గ్రామస్తులు దురుసుగా ప్రవర్తించారని ఎస్డీఎం చెప్పారు. రేషన్ డీలర్ రిజ్వాన్‌పై కేసు కూడా నమోదు చేశామని ఆయన చెప్పారు.

స్పందించిన సీఎం కార్యాలయం

స్పందించిన సీఎం కార్యాలయం


ఘటనపై సీఎం కార్యాలయం కూడా స్పందించింది. దుమారం చెలరేగడంతో.. విచారణకు ఆదేశించామని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శైలేంద్ర సింగ్ తెలిపారు. విచారణ తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ ఈ వివాదం మాత్రం దుమారం రేపుతోంది. గ్రామస్తులతో ఎస్డీఎం ప్రవర్తనను నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని అంటున్నారు. హోదాలో ఉన్న అధికారులే ఇలా బీహెవ్ చేయడం క్షమించరాని నేరం అని కామెంట్ చేస్తున్నారు.

English summary
moradabad sdm ghanshyam verma abused villagers. they are came to sdm office for cancel ration license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X