వీడి దుంప తెగ- హైవే సైన్ బోర్డ్‌పై మందుబాబు యోగాసనాలు: హడలి చచ్చిన జనం
న్యూఢిల్లీ: ఇవ్వాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యోగాసనాలు వేశారు. సూర్య నమస్కారాలు చేశారు. ప్రాణాయామంతో యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకాస్సేపట్లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి నార్త్ లాన్‌లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. యోగా సెషన్‌ను స్వయంగా ఆయన లీడ్ చేయనున్నారు.
అదే సమయంలో ఓ మందుబాబు- జనాలను హడలెత్తించాడు. యోగాసనాలు వేయడానికి, బస్కీలను తీయడానికి అతను ఎంచుకున్న స్థలం- జాతీయ రహదారిపై ఉండే టోల్ సైన్ బోర్డ్. వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే సైన్ బోర్డ్ మీద ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించాడా వ్యక్తి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అంతెత్తు నుంచి కిందికి పడటం, వాహనాల మధ్య పచ్చడి కావడం ఖాయం.

ఒడిశాలోని బోలంగీర్ జిల్లా పట్నాగఢ్ జాతీయ రహదారి మీద ఉండే ఓ టోల్ గేట్ సైన్ బోర్డ్ మీద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంభాల్‌పురి మహనీ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతను దీన్ని ఎప్పుడు తీశాడో తెలియట్లేదు గానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications