ఒకే వేదికపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. వీడియో వైరల్!

దేశ రాజధాని ఢిల్లీలోని 6 జన్ పథ్ వేదికగా సోమవారం రాత్రి ఓ అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో తీవ్ర ప్రత్యర్థులుగా ఉండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకే ప్రాంగణంలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఎన్సీపీ నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే రిసెప్షన్ కార్యక్రమంలోఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రేవతీ సూలే నాగ్‌పూర్ పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీల పెళ్లి జూన్ నెలలో ముంబైలో జరగగా.. ప్రముఖుల కోసం ఢిల్లీలో ఈ గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించారు.

ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపు
ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపు

పార్లమెంట్‌లో వాదప్రతివాదనలతో వేడెక్కించే నాయకులు ఇక్కడ ఎంతో సరదాగా గడిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపైకి వెళ్లి నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అమిత్ షా అక్కడి నుంచి వెళ్లిన వెంటనే సుప్రియా సూలే స్వయంగా గాంధీ కుటుంబాన్ని(సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) వేదికపైకి ఆహ్వానించారు. నూతన దంపతుల పక్కన సోనియా గాంధీ నిలబడగా.. ఇరువైపుల రాహుల్, ప్రియాంక నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.

Viral Video PM Modi Amit Shah Rahul Gandhi Attend Supriya Sule Daughter Reception Full Details

ఈ రిసెప్షన్ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ సీనియర్ నాయకుడు శరద్ పవార్, ఆయన సతీమణిని ఆప్యాయంగా పలకరించి అనంతరం వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయంగా సిద్ధాంతాలు వేరుగా ఉండే నాయకులు ఒకరినొకరు కలుసుకోవడంతో ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూర్చున్న టేబుల్ వద్దకు సోనియా గాంధీ వెళ్లి కుశలప్రశ్నలు వేశారు.

యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్
యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్

రాజకీయ ప్రత్యర్థి నాయకులందరూ తమ విభేధాలను పక్కనపెట్టి ఒకే టేబుళ్లు వద్ద కూర్చుని సరదాగా సంభాషించుకున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, చిరాగ్ పాశ్వాన్, గజేంద్ర సింగ్ షెకావత్, గిరిరాజ్ సింగ్, రామ్‌దాస్ అథావాలే, ప్రఫుల్ పటేల్, మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, తదితరులు ఈ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+