గవర్నర్ ఫస్ట్ చాన్స్ పన్నీర్ సెల్వంకే ఇచ్చారు: సగం విజయం, శశికళకు!

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం నువ్వా ? నేనా ? అంటూ పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం, శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అయితే తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తున్నారు.

గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును కలవడానికి చెన్నైలోని రాజ్ భవన్ పన్నీర్ ల్వం, శశికళకు సమయం కేటాయించింది. అయితే అక్కడా పన్నీర్ సెల్వంకు చక్కటి అవకాశం చిక్కింది. గురువారం సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వంకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

VK Sasikala to meet Governor at 7.30 pm, Panneerselvam at 5 pm

గురువారం రాత్రి 7.30 గంటలకు గవర్నర్ ను కలవడానికి శశికళ నటరాజన్ అవకాశం ఇచ్చారు. శశికళ కంటే ముందే రాజ్ భవన్ వెలుతున్న పన్నీర్ సెల్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి పూసగుచ్చినట్లు గవర్నర్ కు వివరించనున్నారు.

తరువాత గవర్నర్ ను కలుస్తున్న శశికళ తనకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు అనే విషయం వివరించనున్నారు. గురువారం మద్యాహ్నం చెన్నై చేరుకుంటున్న గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వాగతం పలకడానికి పన్నీర్ సెల్వం ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

వీలైతే ఎయిర్ పోర్టులోనే గవర్నర్ విద్యాసాగర్ రావుకు పూర్తి సమాచారం ఇవ్వాలని, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు చేసిన సంతాకల పత్రాలు ఇవ్వాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. గవర్నర్ ను కలవడంలో పన్నీర్ సెల్వం ముందుండటంతో ఆయన సగం విజయం సాధించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+