• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు కరోనా పాజిటివ్ -24 గంటల్లో ట్విస్టులు -ఐసీయూలో చేరిక -జయలలిత చికిత్సలా?

|
Google Oneindia TeluguNews

అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆరోగ్యానికి సంబంధించి గడిచిన 24 గంటల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పూర్తి చేసుకున్న ఆమె వచ్చే వారం జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా, అనారోగ్యానికి గురై, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, ఆస్పత్రిలో చేరారు. తీరా ఇప్పుడు ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది..

Recommended Video

  Ahead of Release From Jail, VK Sasikala's Assets Worth 1,500 Crore seized | Oneindia Telugu

  ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి -ఉమ్మడి ఖమ్మం నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ -జమిలికి సిద్ధంగా..ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి -ఉమ్మడి ఖమ్మం నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ -జమిలికి సిద్ధంగా..

   10 నెలలుగా ఆమెను చూడలేదు..

  10 నెలలుగా ఆమెను చూడలేదు..

  గడిచిన 10 రోజులుగా జ్వరం, నీరసం తదితర లక్షణాలతో బాధపడుతోన్న శశికళను పరప్పణ అగ్రహాన జైలు నుంచి బుధవారం బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. శశికళ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని, గడిచిన 10 నెలలుగా ఆమెను బంధువులుగానీ, సన్నిహితులుగానీ ఎవరూ చడలేకపోయారని వార్తలు వచ్చాయి. చిన్నమ్మ అనారోగ్యంపై ఆమె అభిమానుల్లో గందరగోళం నెలకొన్నవేళ.. వైరస్ సోకిందన్న వార్త మరింత ఆలోచింపజేస్తున్నది..

   ఈనెల 27న విడుదల కానున్నా..

  ఈనెల 27న విడుదల కానున్నా..

  కరోనా పాజిటివ్ గా తేలిన శశికళ.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. కరోనా నిర్ధారణ అయిన తర్వాత బోరింగ్ ఆస్పత్రి నుంచి విక్టోరియాకు తరలించారు. ఆమె వయసు 66 ఏళ్లు కావడంతో చికిత్స ఫలిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. జైల్లో ఉన్నప్పుడే ఆమెకు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే,

  శశికళ హెల్త్ బులిటెన్..

  శశికళ హెల్త్ బులిటెన్..

  వీకే శశికళ ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్లు ఆమెను పరిశీలిస్తున్నారని టీటీవీ దినకరన్ చెప్పారు. ఆమె ఆరోగ్యాన్ని వైద్యులు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెకు ఆక్సిజన్ అవసరం అవుతోందని తెలిపారు. శశికళ ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులు సాయంత్రం 5 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమెను బౌరింగ్ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారని, శశికళ టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం, యూటీఐతో బాధపడుతున్నారని చెప్పారు. ఆమెకు యాంటీబయోటిక్స్ ఇస్తున్నామన్నారు. ఆమె ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని గుర్తించారు. అది కొంచెం తీవ్రంగానే ఉన్నట్టు సీటీ స్కాన్‌లో తేలింది. శశికళ ప్రస్తుత పరిస్థితిని నాటి జయలలిత చికిత్సతో పోల్చుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొరఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

  English summary
  VK Sasikala, the close aide of former Tamil Nadu Chief Minister J Jayalalithaa, tested positive for the coronavirus in Bengaluru on Thursday. She is being treated in the Intensive Care Unit (ICU) at Victoria Hospital, after being shifted from Bowring Hospital earlier in the day. Incidentally, this is the third test that has returned positive for the former AIADMK General Secretary. Two earlier tests - a rapid antigen test and an RT-PCR test - had returned negative on Wednesday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X