బృందావనంలో ఘోర ప్రమాదం.. ఆరుగురు భక్తులు దుర్మరణం.. మరో 12 మంది!
ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పవిత్ర యమునా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. బృందావనంలోని యమునా నదిపై ఉన్న పిపా వంతెన సమీపంలో భక్తులతో నిండిన పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి భక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ.. అప్పటికే ఆరుగురు భక్తులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వారంతా పంజాబ్ నుంచి బృందావనంను సందర్శించేందుకు వచ్చినట్లు సమాచారం.
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందిన వెంటనే మథుర జిల్లా యంత్రాంగం.. స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. యమునా నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తూ గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి
బృందావనంలో జరిగిన ఈ పడవ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణమే తగిన పరిహారం అందజేయాలని అధికారులకు సూచించారు.
శోకసంద్రంలో బృందావనం
పుణ్యక్షేత్రమైన బృందావనంలో భక్తుల మరణంతో విషాద ఛాయలు అలముకున్నాయి. యమునా నది తీరం భక్తుల ఆర్తనాదాలతో నిండిపోయింది. తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని గల్లంతైన వారి బంధువులు నదీ తీరంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
#मथुरा#वृंदावन के केसी घाट पर श्रद्धालुओं से भरी स्टीमर नाव #यमुना नदी में पलटी।
— Goldy Srivastav (@GoldySrivastav) April 10, 2026
हादसे में 6 की #मौत#Mathura#Vrindavan#BoatAccident#YamunaRiver#UttarPradesh#NewsFlash@mathurapolice@Uppolice@mathurapolice@UPGovt pic.twitter.com/j2C6JC9on9












Click it and Unblock the Notifications