వార్ రూమ్‌కు డిగ్గీ కాల్: సబ్బం, ఉండవల్లి దూరమే
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో కాంగ్రెసు అధిష్టానం వార్ రూంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వార్ రూం సమావేశానికి దూరంగా ఉండాలని తిరుగుబాటు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హర్ష కుమార్, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ మాత్రం హాజరు కావడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి సమావేశానికి రావాల్సిందిగా తిరుగుబాటు ఎంపీలకు ఫోన్ చేసి సూచించారు. దిగ్విజయ్ సింగ్ ఫోన్ వచ్చిన తర్వాత తిరుగుబాటు ఎంపీలు సమావేశమై ఏం చేయాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. చివరకు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వార్ రూం భేటీకి దిగ్విజయ్ సింగ్‌తో పాటు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వచ్చారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, బలరాం నాయక్, చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణి హాజరయ్యారు.
పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, నంది ఎల్లయ్య, నంది ఎల్లయ్య, రాపోల్ ఆనంద భాస్కర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కెవిపి రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications