ఆరేళ్ళ వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యా: ఆ కలెక్టర్ షాకింగ్ కామెంట్స్!!

ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు తమ జీవితంలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ తనకు ఎనిమిదేళ్ల వయసు నుండి తన తండ్రి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన విషయాలను చెప్పగా, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ తను కూడా తన తండ్రితో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఇప్పుడు బాలికలు, యువతులు తమపై జరిగే లైంగిక వేధింపులపై గట్టిగా మాట్లాడాలని, వారిని వేధిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని వారు సూచించారు. అయితే తాజాగా కేరళ రాష్ట్రంలోని పతనం తిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ కూడా లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఆరేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారు అంటూ ఆమె పేర్కొన్నారు.

Was Sexually Abused at the Age of Six: IAS Divya S Iyer Shocking Comments!!

ఇద్దరు వ్యక్తులు తనను ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకున్నారని, వాళ్లు తనను ఎందుకు తాకుతున్నారో, ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో తనకు అర్థం కాలేదని, అయితే వాళ్లు తన డ్రెస్ తీసేసినప్పుడు తనకు ఇబ్బందిగా అనిపించి, అక్కడినుండి పారిపోయానని ఐఏఎస్ దివ్య ఎస్ అయ్యర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారా అని భయంగా చూసేదాన్ని అని, తల్లిదండ్రుల సహకారంతో ఆ భయం నుంచి బయటపడగలిగానని కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ చెప్పారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక వర్క్ షాప్ లో ఈ విషయాన్ని చెప్పిన దివ్య ఎస్ అయ్యర్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీతాకోకచిలుకల్లా స్వేచ్ఛగా పిల్లలు తిరగాల్సిన సమయంలో లైంగిక వేధింపుల అనుభవాలు రాకుండా ప్రతి ఒక్కరు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+