Video:గ‌ర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్, రెడ్ హ్యండెడ్ గా దొరికిన భ‌ర్త‌, కాళి అవతారం ఎత్తిన భార్య‌

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జం.. విడిగా ఉన్న ఒక‌రిపై మ‌రొక‌రికి ప్రేమ ఉంటుంది. అయితే ఇంత‌లో భార్య లేదా భ‌ర్త మ‌రొక‌రితో స‌హ‌జీవ‌నం చేస్తే ఇబ్బందే.. అవ‌త‌లి వారు త‌ట్టుకోలేరు. దాడి చేసేందుకు వెనకాడ‌రు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఘ‌జియాబాద్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగింది. ఓ వివాహిత‌.. త‌న భ‌ర్త షాపింగ్ కు గ‌ర్ల్ ఫ్రెండ్ తో రావ‌డాన్ని జీర్ణించుకోలేదు. త‌న మందీ మార్బ‌లం తీసుకొచ్చి.. మ‌రీ దాడి చేసింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

గ‌ర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్

గ‌ర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్

కార్వా చౌత్.. అంటే ఉత్త‌రాదిలో మ‌హిళ‌లు జ‌రుపుకునే పండ‌గ‌. ఘ‌జియాబాద్ లో రాహుల్ అనే అత‌ను త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని షాపింగ్ కోసం వ‌చ్చాడు. విషయం తెలిసి అత‌ని భార్య అక్క‌డికి చేరుకుంది. ఇద్ద‌రు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డారు. ఇంకేముంది ఆగ్ర‌హాం క‌ట్ట‌లు తెంచుకుంది. భ‌ర్త‌, స‌వ‌తిపై దాడి చేసింది. ఆమెతో వ‌చ్చిన వారు కూడా దాడికి దిగారు. భార్య అయితే చెప్పు తీసి కొట్టేంత ప‌నిచేసింది. కానీ అప్ప‌టికే చాలా మంది గుమిగుడారు. వారిని ఆపే ప్ర‌య‌త్నం చేశారు.

ప్లీజ్ ఇక్క‌డినుంచి వెళ్లండి

ప్లీజ్ ఇక్క‌డినుంచి వెళ్లండి


భార్య అండ్ కో బీభ‌త్సం చేస్తోండ‌గా.. షాప్ యాజ‌మాని అక్క‌డికి వ‌చ్చారు. ద‌య‌చేసి ఇక్క‌డినుంచి వెళ్లండని స‌జెస్ట్ చేశారు. బ‌య‌ట‌కు వెళ్లి మీరు మీరు చూసుకొండి.. ప్లీజ్ అని బ‌తిమిలాడ‌టం మ‌నం విజువ‌ల్ లో చూడొచ్చు. అక్క‌డ అంద‌రూ ఉండ‌గా.. కొంద‌రికీ ఏం జ‌రిగిందో తెలియ‌లేదు. త‌ర్వాత ఒక‌రి నుంచి మ‌రొక‌రికి తెలిసింది.

2017లో పెళ్లి

2017లో పెళ్లి


రాహుల్ ను ప్రీతి 2017లో పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత వారు బానే ఉన్నారు. కానీ గ‌త మూడేళ్ల నుంచి మాత్రం గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్క‌డే ఉంటుంది. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. త‌న భ‌ర్త మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని ప్రీతి ఆరోపిస్తోంది. త‌న‌ను మాత్రం ఇంటికి తీసుకెళ్ల‌డం లేద‌ని అంటోంది. ఇంత‌లో వారు ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డ్డారు.

ఫ్రెండ్స్ తో క‌లిసి దాడి


కార్వా చౌత్ సంద‌ర్భంగా రాహుల్ షాపింగ్ చేస్తూ ప‌ట్టుబడ్డారు. ఇంకేముంది ఆమె ఆగ్ర‌హాం క‌ట్ట‌లు తెంచుకుంది. త‌న స్నేహితుల‌తో క‌లిసి దాడికి దిగింది. అక్క‌డ నానా ర‌చ్చ చేసింది. ఆమె ఆగ్ర‌హాం స‌బ‌బేన‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రీ ప‌బ్లిక్ గా ఏంటీ న్యూసెన్స్ అని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+