వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL:పోతరాజులా రాహుల్, వీరగోలతో కొట్టుకుంటూ.. వైరల్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే యాత్రలో రాహుల్ అందరితో కలిసిపోతున్నారు. యాత్రలో రాహుల్ రన్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత బస్సు టాప్ పైకి ఎక్కి మరీ అభివాదం చేశారు. ఇప్పుడు మరో ఫీట్ చేశారు. అదే.. పోతరాజుగా మారి వీరగోలతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఆశేష జనవాహిని మధ్య.. ఆయన ఇలా చేశారు.

బోనాల వేడుక..

బోనాల వేడుక..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వుతుంది. ఇదీ బోనాలు వేడుకలో భాగం. ఆషాఢ మాసంలో హైదరాబాద్ వేదికగా బోనాలు ఘనంగా జరుగుతాయి. అయితే రాహుల్ గాంధీ వీరగోల (తాడు) తీసుకొని కొట్టుకున్నాడు. దానిని పోతరాజులు వేసుకొని.. కొట్టుకుంటారు. అదీ ఇప్పటినుంచి కాదు.. 18వ శతాబ్దం నుంచి ఆచారం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో అలా వేసుకుంటారు.

గ్రామ దేవతలు..

పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకాలమ్మ, పోలేరమ్మ పేరుతో అమ్మవారు (గ్రామ దేవతలు) ఉంటారు. వారిని పూజించే వారిని గ్రామ దేవత పూజారి అంటారు. ఆషాడ మాసంలో తొలి ఆదివారం గోల్కొండ కోట వద్ద బోనాల జాతర మొదలవుతుంది. రెండో ఆదివారం బాల్కంపేట ఎల్లమ్మ జాతర.. ఉజ్జయిని మహంకాళి జాతర కొనసాగుతోంది.

మూడో ఆదివారం చిలకలగూడ పోచమ్మ, కట్ట మైసమ్మ ఆలయం, మహేశ్వరి ఆలయం, లాల్ దర్వాజా టెంపుల్ బోనాలు జరుగుతాయి. అక్కన్న మాదన్న టెంపుల్, హరిబౌలి, ముత్యాలమ్మ ఆలయం, షా లీ బండలో బోనాలు జరుగుతాయి. వేలాది మంది జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

అమ్మవారి సోదరుడే పోతరాజు

అమ్మవారి సోదరుడే పోతరాజు

మహంకాళి అమ్మవారి సోదరుడు పోతరాజు. అతను బోనం ఎత్తిన మహిళకు రక్షణగా ఉంటారు. బోనాలు పండగులో పోతరాజులతో మంచి కళ వస్తోంది. ఆచారం ప్రకారం అయితే మద్యపానం నిషేధం అమల్లో ఉంది. అయితే సహజసిద్దమైన రంగులతో ముగ్గులు వేసి.. పూజలు చేస్తారు. కొందరు ఉపవాసం కూడా ఉంటారు. ఘటాల ఊరేగింపు కూడా జరుగుతుంది.

English summary
Congress MP Rahul Gandhi is seen whipping himself in a video that is going viral on social media. video is from the Telangana Bonalu festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X