భారత్ లో దాగి ఉన్న 8 జలపాతాలు ఇవే.. ఇక్కడకు వెళ్తే చల్లచల్లగా కూల్ కూల్..!!

ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ లో ఫ్యామిలీతో పాటు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉందా..? అయితే మీకు ఈ జలపాతాల గురించి తెలుసా..? భారత్ లోని ఈ దాగి ఉన్న జలపాతాలు దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఉన్నాయి. అక్కడి చేరుకోవాలంటే సాహసోపేతమైన జర్నీ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఇక్కడకు వెళ్లొచ్చు. మరి ఈ క్రేజీ వాటర్ ఫాల్స్ ను చేరుకోవాలంటే ఎలా వెళ్లాలి..? వాటి వివరాలు ఇక్కడ చూద్దాం..


భారత్ లో అనేక జలపాతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జలపాతాలను చేరుకోవడం అంత సులభం కాదు. దానికి చాలా సాహసమే చేయాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఆ ప్రాంతానికి చేరుకోలేం.. వాటిలో మహారాష్ట్రంలోని దేవ్ కుండ్ జలపాతం ఒకటి. ఇది భీరా సమీపంలోని సహ్యాద్రీ అడవుల్లో దాగి ఉంది. ఈ జలపాతం వేసవిలోనూ ఎండిపోకుండా ప్రవహిస్తుంది. దట్టమైన అడవి గుండా రెండు గంటల పాటు సాగుతుందీ జర్నీ.

అలాగే మేఘాలయలోని నోహ్కలికై జలపాతం.. ఇది చిరపుంజీ సమీపంలో ఉంటుంది. ఇది భారత్ లోనే ఎత్తయిన ప్లంజ్ జలపాతం. ఇక్కడకు చేరుకోవాలంటే కఠినమైన ప్రదేశాలను దాటుకుంటూ వెళ్లాలి. ఈ జలపాతం కింద సరస్సు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తమిళనాడులోని ఆగయ గంగై జలపాతం స్థానికంగా చాలా ఫేమస్. ఈ జలపాతం తూర్పు కనుమలలోని కొల్లి కొండల్లో దాగి ఉంటుంది. ఈ జలపాతానికి చేరుకోవాలంటే దాదాపు 1000 కంటే ఎక్కువ మెట్లను కిందకు దిగాల్సి ఉంటుంది.

Waterfalls 8 Hidden in India Amidst Dense Forests Beautiful Offbeat Destinations You Must Explore

ఇక కర్ణాటకలోని కుడ్లు తీర్థ జలపాతం కూడా అద్భుతంగా ఉంటుంది. పశ్చిమ కనుమల్లో ఈ వాటర్ ఫాల్స్ దాగి ఉంది. ఈ జలపాతం చేరుకోవాలంటే నదులను దాటుతూ.. రోప్ బ్రిడ్జిల మీద నుంచి నడుస్తూ చేరుకోవాలి. అలాగే ఒడిషాలోని డుడుమ జలపాతం ఏపీ- ఒడిషా సరిహద్దులో ఉంటుంది. మచ్ కుంద్ నదిపై ఈ జలపాతం ఉంటుంది. తూర్పు భారత్ లోని ఎత్తైన జలపాతాల్లో ఇది ఒకటిగా ఉంది. అలాగే వీటితోపాటుగా అరుణాచల్ ప్రదేశ్ లోని నురనాంగ్ జలపాతం, తమిళనాడులోని తలైయార్ జలపాతం కూడా చాలా ఫేమస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+