యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్త పథకం, అర్హతలు..మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత కోసం కొత్త పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ సబ్సిడీతో వారికి ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందు కోసం ఈ తాజా ప్రతిపాదన విధి విధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చే వారం నుంచి లబ్దిదారులను ఎంపిక చేయనుంది. దీని ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం యువత కోసం మరో పథకం అమలు చేస్తోంది. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్ధిక సాయం అందిస్తోంది. భాగంగా ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా యువతకు ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకే అందించనుంది. భారీ సబ్సిడీతో ఈవీ వెహికల్స్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చే వారం నుంచి లబ్దిదారులను ఎంపిక చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరక అర్హులైనవారికి వెహికల్స్‌ను పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకం అమలు చేయనున్నారు. అందులో భాగంగా దాదాపు 10 వేల మంది తొలిగా పంపిణీ చేయనున్నారు.

ప్రభుత్వం మార్గదర్శకాలు
కాగా, ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.219 కోట్ల ఖర్చు చేయనుంది. ఈ వెహికల్స్ ద్వారా లాజిస్టిక్స్, ఈ-కామర్స్, డెలివరీ రంగాల్లో యువత రాణించవచ్చు. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 5016 మందికి టూవీలర్లను అందించనుంది. ఒక్కొ యూనిట్ విలువ రూ.లక్షగా నిర్ణయించింది. కాగా... ముందుగా 2508 మందికి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నారు. ఇందుకోసం ఒక్కొ ఈవీ వెహికల్‌కు రూ.3 లక్షల ఖర్చు కానుంది. వీటి కోసం తయారీదారుల నుంచి టెండర్లను ఈ నెలాఖరు కల్లా ఖరారు చేయనుంది. దీంతో.. ప్రభుత్వం కాలుష్య రహితంగా కొత్త వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో పాటుగా యువతకు స్వయం ఉపాధి కల్పించేలా ఈ పథకానికి రూప కల్పన చేసారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications