డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పై వైసీపీ బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!
ఇప్పుడు దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తోంది. రాజకీయంగా కొత్త స్వరూపం ఇచ్చేందుకు కేంద్రం కీలక బిల్లులను ప్రవేశ పెట్టింది. మహిళా బిల్లుతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన పైన చర్చ సాగుతోంది. మహిళా బిల్లుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కూటమి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తోంది. దీంతో.. తటస్థ పార్టీల మద్దతు బీజేపీకి అవసరంగా మారింది. అనేక సందర్భాల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తూ వస్తున్న వైసీపీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లులో తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పింది. ఇది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశ పెట్టింది. మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లును సభ ముందు ఉంచింది. విపక్ష సభ్యులు దక్షిణాది రాష్ట్రాలకు ఈ తరహా డీ లిమిటేషన్ తో అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. కాగా, బీజేపీ నేతలు ఎవరికీ నష్టం జరగదని.. ప్రతీ రాష్ట్రంలో 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ కావాలంటే ఎన్డీఏకు ఉన్న బలం.. విపక్షాల సభ్యుల సంఖ్య చూసిన తరువాత ఇంకా 69 సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇందు కోసం వైసీపీ సహా తటస్థ పార్టీలతో బీజేపీ టచ్ లోకి వెళ్లింది. కాగా, వైసీపీ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. బిల్లు ఆమోదం వేళ కొత్త కండీషన్లు పెడుతోంది.

వైసీపీ మద్దతు ఇస్తూనే.. స్పష్టత కోసం
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పై వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏపీకి ఒక్క సీటు తగ్గినా డీలిమిటేషన్ కు వైసీపీ సపోర్ట్ చేయదని తేల్చి చెప్పారు. మాజీ సీఎం జగన్ తొలి నుంచి మహిళా పక్షపాతిగా నిలిచారని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పోస్టులు.. స్థానిక సంస్థల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసారని గుర్తు చేసారు. నామినేటెడ్ వర్క్స్ లోనూ మహిళలకు 50 శాతం అప్పగించారని చెప్పారు. కేంద్రం జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరిగేలా చూస్తామని హామీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ మహిళా బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. డీలిమిటేషన్ పైన వస్తున్న సందేహాలకు కేంద్రం ఇచ్చే సమాధానం కీలకం కానుందని మిథున్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సీట్ల పెంపు.. సమాన నిష్ఫత్తిలో జరగాలని కోరారు. విపక్ష సభ్యుల మద్దతు లేకుండా బిల్లు పాస్ కాదని.. కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తే బిల్లు ఆమోదం పొందుతుందని మిథన్ స్పష్టత ఇచ్చారు.













Click it and Unblock the Notifications