Priyanka Gandhi: ప్రియాంక గాందీ ఆస్తులు, అప్పులివే-వాయనాడ్ ఎన్నిక అఫిడవిట్ లో ..
కేరళలోని వాయనాడ్ ఎంపీ స్ధానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ అరంగేట్రం చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో వాయనాడ్ నుంచి ఆమె అన్న రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచారు. ఈసారి మాత్రం తాను గెలిచిన మరో స్ధానం రాయ్ బరేలీని ఉంచుకుని, వాయనాడ్ కు రాజీనామా చేసారు. దీంతో రాహుల్ వారసురాలిగా ఇక్కడ ప్రియాంక బరిలోకి దిగుతున్నారు. అలాగే ఆమె ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాయనాడ్ పార్లమెంట్ స్ధానం ఉపఎన్నికల్లో తన అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. అలాగే తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలు కూడా అఫిడవిట్ లో వెల్లడించారు. దీని ప్రకారం ప్రియాంక గాంధీకి మొత్తం రూ.12 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అలాగే రాబర్ట్ వాద్రాకు రూ.66 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఇందులో తెలిపారు.

మరోవైపు గత ఆర్ధిక సంవత్సరంలో తనకు రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. ఆస్తుల్లో మూడు బ్యాంకుల్లో డిపాజిట్లు,మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, పీపీఎఫ్ కలిపి మొత్తం రూ. 4.24 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే కోటీ 15 లక్షల విలువైన బంగారు అభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, మెహ్రౌలీలో వారసత్వంగా వచ్చిన భూములు రూ.7.74 కోట్ల విలువైనవి ఉన్నాయన్నారు. అలాగే 80 కోట్ల మేర ఐటీ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications