వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామ్‌ సక్సెస్‌పై జగన్ హర్షం, జయలలితకి రోజా ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప/చెన్నై: అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.

ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఇదో అద్భుత చారిత్రక రోదసీ ఘట్టమన్నారు. మామ్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత శాస్త్రవేత్తల శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయిందని అన్నారు. కాగా, అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశ పెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

We have achieved the near impossible: YS Jagan

జయలలిత ప్రేరణ: రోజా

తనకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే ప్రేరణ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, చిత్తూరు జిల్లా నగరి శాసన సభ్యురాలు రోజా వేరుగా అన్నారు.

జయలలిత రాజకీయాలలోకి వచ్చినప్పుడు తాను చూశానని, ఆమె చాలా దృఢసంకల్పం కలవారని రోజా అన్నారు. తాను ఎప్పుడు తన నియోజకవర్గం వారికి అందుబాటులో ఉంటానని చెప్పారు. రోజా ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నారట. అయితే, సినిమాల్లోకి వచ్చిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy hails mars orbiter mission success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X