• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వలస కూలీల వెతలు అర్థం చేసుకుంటాం..!ఏ లోటు రానివ్వమంటున్న కేంద్రం..!

|

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల వెతలు మాత్రం వర్ణనాతీతంగా పరిణమించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను ఆదుకునేందుకు, వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బాహుబలి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం అతి భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికి వలస కార్మికులకు మాత్రం ఆ నిధులు ఇంకా అందలేదని తెలుస్తోంది. వలస కార్మికులను ఆదుకోవడంలోగాని, వారిని గుర్తించి స్వస్థలాలకు చేర్చడం వంటి కార్యాచరణ రూపొందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందనే విమర్శల నుండి బయటపడేందుకు మోదీ సర్కార్ వినూత్న మార్గాలను అణ్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా బారిన ఏపీ: ఇప్పటిదాకా 52 మంది మృత్యువాత: చిత్తూరుజిల్లాలో తొలి మరణం: భారీగా కేసులు

మేం ఉన్నాం.. వలస కూలీలను అన్ని విధాల ఆదుకుంటామని కేంద్రం ప్రకటన..

మేం ఉన్నాం.. వలస కూలీలను అన్ని విధాల ఆదుకుంటామని కేంద్రం ప్రకటన..

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూళ్ల బాట పట్టిన వలస కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రవాణా సదుపాయాలు లేకపోవడంతో వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఇబ్బందిపడుతున్న వలస వలస కూలీల సౌకర్యాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది.

దేశం నలుమూలల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. వలస కూలీలను తీసుకెళ్లడానికి మరిన్ని ప్రత్యేక రైళ్లను, బస్సులను నడపాలని పేర్కొంది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రాలకు తగు సూచన చేసిన కేంద్రం.. ప్రత్యేక రవాణా వ్యవస్ధను అనుమతించాలన్న హోం శాఖ..

రాష్ట్రాలకు తగు సూచన చేసిన కేంద్రం.. ప్రత్యేక రవాణా వ్యవస్ధను అనుమతించాలన్న హోం శాఖ..

అంతేకాకుండా వలస కూలీలు ఏమార్గంలో వెళ్లాలనుకున్న వారికి అవకాశం కల్పించాలని సూచించారు. వారికి మార్గమధ్యంలో విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైతే ఎన్‌జీవో సంస్థల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, వారికి నిత్యం ఆహారం అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇక రైలు పట్టాలు, రోడ్ల వెంబడి వలస కూలీలు నడవకుండా చూసేలా ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు అజయ్‌ భల్లా పేర్కొన్నారు. ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖను అజయ్‌ భల్లా ట్విటర్‌లో కూడా షేర్‌ చేశారు.

హృదయ విదారకంగా వలసల ప్రయాణం.. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వాలు..

హృదయ విదారకంగా వలసల ప్రయాణం.. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వాలు..

వలస కూలీల అవసరాల పట్ల కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచనలు చాలా ఆలస్యంగా చేసిందని, వలస కార్మికులకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక స్పందిస్తే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా వైరస్ బాదితుల కన్నా వలస కార్మికుల కష్టాలు ప్రజల హృదయాలను కదిలించాయనే చర్చ జరుగుతోంది. వందల కిలో మీటర్లు కాలిబాటన చేరుకోవాలనే సంకల్పం ముందు ఏ సాహసం కూడా నిలబడలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లా పాపలతో, వస్తువుల సంచులతో ఎర్రటి ఎండలో, నల్లటి తారు రోడ్డు మీద వలస కార్మికులు నడుస్తున్న తీరును చూసి హృదయం దహించిపోయినట్టు చర్చ జరిగింది. అయినప్పటికి ప్రభుత్వాలు ఎందుకు ప్రత్యేక చర్యలు తీసుకోలదనే అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

  Western Railway Recruitment 2020 Notification,Total 175 Paramedical Posts
  ఎవరి సాయం అవసరం లేదు.. అంతా అయిపోయాక ఎందుకంటున్న వలస కూలీలు..

  ఎవరి సాయం అవసరం లేదు.. అంతా అయిపోయాక ఎందుకంటున్న వలస కూలీలు..

  ఇదిలా ఉండగా తాజాగా కేంద్రం చేసిన ప్రకటన, రాష్ట్రాలకు చేసిన సూచనలపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. నడిచీ నడిచీ కాళ్ల చర్మం ఊడిపోయాక చెప్పులు వేసుకోండన్నట్టు కేంద్ర వ్యవహారం ఉందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అంతా అయిపోయిన తర్వాత కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయడం విడ్డూరంగా ఉందనే పలువురు రాజకీయ నేతలు స్పందింస్తున్నారు. ఐతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూసి విసిగి వేసారి పోయిన వలస కార్మికులు మాత్రం ప్రభుత్వాల మీద విశ్వాసం సన్నగిల్లినట్టు వ్యవహరిస్తున్నారు. అవసరంలో ఉన్నప్పుడు స్పందించకుడా ఇప్పుడు స్పందించి ఏంలాభమని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే కేంద్ర తాజా ప్రకటన, మార్గ దర్శకాల పట్ల వలసకూలీలు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది.

  English summary
  The Union Home Department has directed all states to cooperate with those who wish to travel from all parts of the country.On Tuesday, Union Home Secretary Ajay Kumar Bhalla wrote a letter to the chief secretaries of various states. It said it would run more special trains and buses to take on migrant workers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X