Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీల్లో కేంద్రాన్ని నిల‌దీసి నిగ్గ‌దీస్తాం.!అపాయింట్ మెంట్ కోసం కొనసాగుతున్న మంత్రుల నిరీక్షణ.!

ఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వ సాగు వ్య‌తిరేక విధానాల‌తో రైతాంగానికి న‌ష్టం కలుగుతోందని మంత్రులు స్పష్టం చేసారు. తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేంతవరకూ సహించేది లేదని ఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ద్వంద వైఖ‌రి అవలంభింస్తోందని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

సోమ‌వారం నాడు దేశ రాజ‌ధానిలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనాల‌ని ఆరుగురు రాష్ట్ర మంత్రులతో, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, నామ నాగేశ్వ‌ర్‌రావు, సహచర టి.ఆర్.ఎస్ ఎంపీలు ఢిల్లీలో మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నామ‌న్నారు.కేంద్ర మంత్రుల సంప్రదింపులపై ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు స్ప‌ష్టత లేద‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

We will depose the center in Delhi.!Ongoing ministerial wait for appointment.!

రైతుల విష‌యంలో పార్ల‌మెంట్ లోపల, బ‌య‌టా టీఆర్ఎస్ ఎంపీలు చిత్త‌శుద్ధితో పోరాడామ‌ని, భ‌విష్య‌త్‌లో కూడా పోరాడుతామ‌ని వెల్ల‌డించారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పట్ల కేంద్రం, బీజేపీ ఎంపీలు అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

We will depose the center in Delhi.!Ongoing ministerial wait for appointment.!

దానికి తోడు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం మంత్రులతో అబద్దాలు చెప్పించిందని మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చిన మేర‌కు ధాన్యం సేక‌ర‌ణ దాదాపు పూర్తయ్యాయని వివ‌రించారు. మిగిలిపోయిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వ‌చ్చామ‌ని, ఈ విష‌యంపై మ‌రోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని తెలిపారు. గతంలో వరి దాన్యం మొత్తం కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. అందుకే త‌మ‌కు స్ప‌ష్ట‌మైన హామీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్టు ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావుతో పాటు వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+