వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 'రెండే 'మాకు ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయి,ఆ రాజకీయాలకు మేం దూరం

పెద్ద నోట్ల నగదు రద్దు, అభివృద్ది అనే అంశాల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు మారిపోయాయి, ప్రస్తుతం ప్రజలకు పెద్ద నోట్ల రద్తుతో నెలకొన్న సమస్యలే కన్పిస్తున్నాయని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అభివృద్ది, పెద్ద నగదు నోట్ల రద్దు అంశాలను తమకు విజయాన్ని అందిస్తాయని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి అభివృద్ది, పెద్ద నగదు నోట్ల రద్దు అంశాలు కలిసి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ వార్త ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

akhilesh yadav

సమాజ్ వాదీ పార్టీలో , ములాయం కటుుంబంలో తలెత్తిన సమస్యలు గతించిన అంశాలనీ ఆయన చెప్పారు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయాని ఆయన చెప్పారు. ప్రజలకు నోట్ల రద్దుతోనే నెలకొన్న సమస్యలు కన్పిస్తున్నాయన్నారు.

తమ ప్రభుత్వం ఐదేళ్ళలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు గుర్తుకు ఉంటాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తమ పార్టీ విజయంలో అభివృద్ది కార్యక్రమాలే కీలకంగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం చేయలేదన్నారు.

బిజెపి, బిఎస్ పి లపై ప్రజలకు విశ్వాసం లేదని ఆయన విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ 300 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. 2012 లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ 224 స్థానాల్లో ఎస్ పి విజయం సాధించింది. బిఎస్ పి 40 స్థానాల్లో, బిజెపి 47, కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది.

ఉత్తర్ ప్రదేశ్ లో తమ పార్టీ మత పరమైన రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకే ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ది అందరికీ సమాన స్థాయిలో జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయమై సామాజిక మాథ్యమాల ద్వారా ప్రజలకుతెలుస్తోందన్నారాయన.

English summary
development and demonetasion advatage for our party said uttar pradesh cm akhilesh yadav. he interview a news media recently. after demonetisation people suffer for new currency. after nov 8 ,people thought about cash only said akhilesh yadav.devolapment, demonetasion also advantage our party said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X