ఈ రైల్వేస్టేషన్ లో లెక్కపెట్టలేనన్ని రైళ్లు
ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటారు. ఖర్చు తక్కువతో ఎంతో సౌకర్యవంతంగా, సురక్షితంగా మనల్ని అనుకున్న గమ్యస్థానానికి చేరుస్తాయి. బస్సు, కారు, విమానంలాంటి వాటితో పోలిస్తే రైలు టికెట్లు చాలా చౌకగా ఉంటాయి. అంతేకాకుండా మరో సదుపాయం కూడా ఉంది.. ప్రశాంతంగా నిద్రపోతూ ప్రయాణం చేయడం.
ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అలాగే మనదేశంలో ఉన్న ఒక రైల్వేస్టేషన్ ఎంతో పెద్దస్టేషన్ గా పేరు తెచ్చుకుంది. పురాతన రైల్వేస్టేషన్ గా హౌరా స్టేషన్ పేరు తెచ్చుకుంది. ఇక్కడ మొత్తం 23 ప్లాట్ ఫారాలున్నాయి. ఈ ప్లాట్ ఫారాలపై రైళ్లను నిలబెట్టి లెక్కపెట్టాలంటే మీరు లెక్కను పూర్తిచేయలేని సంఖ్యలో రైళ్లు వస్తాయి. ప్రతిరోజు ఈ స్టేషన్ కు 300 కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో కోల్ కతాలోని హౌరా రైల్వేస్టేషన్ దేశంలో ప్రథమస్థానంలో నిలుస్తుంది. మొత్తం 26 ట్రాక్ లతో ఈ స్టేషన్ లో రైల్వే లైను వేశారని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. పశ్చి మబెంగాల్ లోని సీల్దా స్టేషన్ లో మొత్తం 20 ప్లాట్ ఫారాలున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఈ రెండు స్టేషన్లు అత్యంత ప్రధానమైనవి. ఈ రెండు రైల్వేస్టేషన్ల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సీల్దా తర్వాత ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో 18 ప్లాట్‌ఫారమ్‌లుంటాయి. దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మొత్తం 16 ప్లాట్‌ఫారాలున్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబ్ రైల్వే స్టేషన్‌లో 10 ప్లాట్ ఫారాలున్నాయి.
సికింద్రాబాద్ రైల్వస్టేషన్ త్వరలోనే సరికొత్త రూపానికి మారబోతోంది. విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఈ పనులకు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే 50 సంవత్సరాల్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని సకల సౌకర్యాలు ఏర్పా టు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది












Click it and Unblock the Notifications