సంచిలో ఏముంది..? యువకుడిని అడిగిన పోలీసులు.. ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..

పశ్చిమ్ బెంగాల్ లోని పురులియా జిల్లాలో పోలీసులు రోజూవారీ మాదిరిగానే రెగ్యూలర్ చెకింగ్ చేస్తున్నారు. నేషనల్ హైవే 18 పై ప్రయాణించే ట్రక్కులు, కార్లు, టూ వీలర్స్ ను ఆపుతూ నిత్యం అర్ధరాత్రి చెకింగ్ చేస్తుంటారు. అయితే రోజూవారీగానే పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో ఓ యువకుడు టీవీఎస్ అపాచీ బైక్ ను నడుపుకుంటూ అటుగా వచ్చాడు. అతడ్ని పోలీసులు ఆపారు. బైక్ వెనకాల పెద్ద సైజులో ఓ తెల్ల గోనె సంచి ఉంది. అందులో ఏదో ఉన్నట్లు ఉంది. సాధారణంగా ఈ గోనె సంచులను వ్యవసాయ పనుల్లో ఎరువుల తరలింపు.. తదితర వాటికోసం రైతులు వినియోగిస్తుంటారు. అయితే ఆ మూటలో ఎరువులు ఉన్నట్లుగా పోలీసులకు కనిపించలేదు. ఏదో ఉంది అనే అనుమానం వారికి కలిగింది. అయితే ఆ మూటను తాళ్లతో కట్టి లేదు. యూఎస్ బీ ఛార్జర్లతో కట్టి ఉంది. పోలీసులు టార్చి లైట్ వేసి చూసి అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఆ సంచి లోంచి కొద్దికొద్దిగా రక్తం కిందకు కారుతోంది. దాంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది.

వెంటనే పోలీసులు నిందితుడ్ని బైక్ దిగి మూట ఓపెన్ చేయమని ఆర్డర్ వేశారు. ఆ యువకుడు మూట ఓపెన్ చేయగా అందులో రక్తపు మడుగులో ఓ యువతి మృతదేహం చూసి పోలీసులు షాక్ అయ్యారు. యువతి మెడకు బలమైన గాయం కూడా ఉంది. అయితే ఆ యువకుడు ఏమీ పారిపోలేదు. అలాగే నిల్చొని ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని తానే చంపేశానని తెలిపాడు. దాంతో పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.

WestBengal Purulia district man killed his girlfriend stuffed her body into sack was caught police

విచారణలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ మహతో(21), ప్రీతిక మహతో ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్‌ లో చదువుకున్నారు. అక్కడ ఏర్పడిన వీరి మధ్య పరిచయం కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారింది. అయితే ప్రీతిక మరో అబ్బాయితో కొంచెం సన్నిహితంగా మెలుగుతుండటంతో అమిత్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అనుమానమే పెనుభూతమై ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అలా హాస్టల్ గదిలో ఎవరూ లేనప్పుడు ప్రీతికను తన రూమ్‌ కు పిలుపించుకున్నాడు. రూమ్‌ కు రాగానే ఆమెతో గొడవ పడి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని నదిలో పడేసేందుకు సంచిలో కుక్కి బైక్‌ పై తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా సంచిపై రక్తపు మరకలు కనిపించి అమిత్‌ ను ఆపి సంచిని చెక్ చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+