ఒడిశా రైలు ప్రమాదానికి కారణమేంటి? సాంకేతిక లోపమా .. లేదా మానవ తప్పిదమా?
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని షాక్ కు గురి చేసింది. మూడు రైలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ రైలు ప్రమాద ఘటనలో 900 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ రైలు ప్రమాద ఘటనలో 278 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది నుజ్జు నుజ్జు అయినా బోగిలలో ఇంకా ఎంత మంది ప్రయాణికులు చిక్కుకొని ఉండవచ్చు అనేది అంచనా వేయలేకపోతున్నారు. 2004 తర్వాత జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలలో ఇదే అతి పెద్ద రైలుప్రమాదం అని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు రైళ్లు ఢీ కొట్టడం ఉన్నది అతి పెద్ద ప్రమాదం అయితే, మూడు రైళ్లు ఒకేసారి ప్రమాదానికి గురికావడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా, మానవ తప్పిదమే అన్న చర్చ జరుగుతుంది. ఆగివున్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ 120 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీ కొట్టింది.
దీంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోని బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఇక ఆ రూట్లో వచ్చిన యశ్వంతపూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్ ల పైకి దూసుకు వెళ్ళింది. ఒకపక్క సహాయకచర్యలు జరుగుతుండగానే, మరోవైపు ఒక దాని వెంట వరుసగా రైలుప్రమాదాలు ఎలా జరిగాయి అన్న దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేమని రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

ఈ ప్రమాదంలో ఆగివున్న గూడ్స్ రైలు ట్రాక్ లోకి కోరమండల్ షాలిమార్ ఎక్స్ ప్రెస్ ఎలా వెళ్ళింది. ఇది సాంకేతికలోపమా లేక మానవ తప్పిదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిగ్నల్ లో లోపం సంభవించే అవకాశం ఉందని చాలా మంది అనుమానం లేవనెత్తారు. రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రైళ్ళ ప్రమాదాల నివారణకు యాంటీ కొలిజన్ సిస్టమ్ కవచ్ ని ఇన్ స్టాల్ చేస్తుంది.
అయితే రైలు డీ కొట్టటానికి ప్రధాన కారణం అయిన సిగ్నల్ పాస్డ్ ఎట్ డేంజర్ అని సిగ్నల్ ఉన్నప్పుడు కవచ్ హెచ్చరిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్ ను అప్రమత్తం చెయ్యగలదు. బ్రేక్ లను నియంత్రించగలదు. అదే ట్రాక్ పై మరో రైలు గమనిస్తే ప్రమాదం జరగకుండా రైలును ఆపగలదు. ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ అందుబాటులో లేదని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications