Chandrayaan 3 : 14 రోజుల తర్వాత చంద్రయాన్ 3 పరిస్దితి ఏంటి ? అక్కడే ఉంటే జరిగేది ఇదేనా ?

చందమామపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే. చంద్రుడిపై నిన్న దిగిన విక్రమ్ ల్యాండర్, దాన్నుంటి బయటికి వచ్చి పరిభ్రమిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కేవలం ఈ 14 రోజుల్లోనే ఏం చేసినా, ఆ తర్వాత కూడా అక్కడే ఉంటే మాత్రం వాటికి సినిమా కనిపించడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఎదురయ్యే ప్రతికూల పరిస్ధితులు అలాంటివి. ఒకవేళ వాటిని తట్టుకుని బయటపడితే మాత్రం మరో 29 రోజుల తర్వాత భారత్ కు మరో గుడ్ న్యూస్ వచ్చినట్లే.

చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్, దాన్నుంచి బయటికి వచ్చి తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం అక్కడి నుంచి ఫొటోలు, వీడియోలతో పాటు అక్కడి వాతావరణం, ఉపరితలంపై ఉన్న మూలకాల సమాచారాన్ని పంపుతున్నాయి. సూర్యుడి నుంచి చంద్రుడిపై పడుతున్న సౌర వెలుగులతో ఇవి పనిచేస్తున్నాయి. ఇలా 14 రోజుల పాటు అక్కడ సాధ్యమైనంత ఎక్కువ దూరం తిరిగి ఈ సమాచారం భూమికి పంపుతాయి. దీని ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై మానవ జీవనం సాధ్యమవుతుందా లేదా అన్నది విశ్లేషించడానికి వీలవుతుంది.

what will happen to chandrayaan 3 lander and rover after 14 days on moon?

అయితే ఈ 14 రోజుల లెక్క ఏంటంటే, భూమిపై 14 రోజుల కాలం చంద్రుడిపై ఒక్క రోజు మాత్రమే. అంటే చంద్రుడి లెక్క ప్రకారం మన చంద్రయాన్ ల్యాండర్, రోవర్ అక్కడ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. భూమిపై మనకు 14 రోజులు కనిపిస్తుంటే, అక్కడ మాత్రం ఒక్క రోజు తర్వాత వాతావరణం ప్రతికూలంగా మారిపోతుంది. అంటే సూర్యుడు అస్తమిస్తాడు. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలం అంతా చీకటిగా మారిపోతుంది. దీంతో అక్కడ చిమ్మ చీకటి అయిపోతుంది. దీంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటుంది.

మన లెక్క ప్రకారం చంద్రుడిపై 14 రోజులు పూర్తయిన తర్వాత అంటే అక్కడి ఒక్క రోజు పూర్తయిన తర్వాత వెలుతురు అంతా పోయి చిమ్మచీకటిగా మారి, ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటే చంద్రయాన్ రోవర్, ల్యాండర్ రెండూ గడ్డకట్టిపోవడం ఖాయం. తిరిగి మరో 14 రోజుల తర్వాత అంటే చంద్రుడిపై మరో రోజు తర్వాత సూర్యుడి వెలుగు ప్రసరిస్తుంది. అప్పుడు మళ్లీ ల్యాండర్, రోవర్ పై సూర్యకిరణాలు పడతాయి. అయితే అప్పటికే గడ్డకట్టుకు పోయిన ఈ రెండూ తిరిగి మంచును కరిగించుకుని తిరిగి పనిచేయగలిగితే మరో అద్భుతం జరిగినట్లే అని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+