వాట్సప్ పుట్టి ఎనిమిదేళ్లు! ఇక డిజిటల్ చెల్లింపుల దిశగా కసరత్తు?
మెసేజింగ్ యాప్ వాట్సప్ లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ తెలిపారు.
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సప్ లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్.
మాజీ యాహూ ఉద్యోగులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ 2009లో ప్రారంభించిన వాట్సప్.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ కు 1.2 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇందులో భారతదేశంలోనే 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

పేటీఎం మాదిరిగా వాట్సప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అవసరమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో వాట్సప్ ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలెట్టిందని, ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పడుతుందని తెలుస్తోంది.
భారత పర్యటనకు వచ్చిన యాక్టన్.. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా సాక్షాత్కరం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని యాక్టన్ అభినందించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications