• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ డీలా-డ్రాగన్ జోరు: చైనా తయారీ రెండో వ్యాక్సిన్ ‘సైనోవాక్’కు WHO అనుమతి -మన ఫార్మాకు దెబ్బ

|

ప్రపంచానికి టీకాల రాజధానిగా కొనసాగిన భారత్ ఇప్పుడు దారుణంగా డీలాపడటం, కరోనా వ్యాక్సిన్ల విషయంలో మోదీ అనూహ్య నిర్ణయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో మన ఫార్మా కంపెనీలు అవకాశాలను పోగొట్టుకొంటున్న దుస్థితి నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ వెనుకబడగా, డ్రాగన్ చైనా జోరు కోనసాగిస్తున్నది. ఆ దేశం రూపొందించిన రెండో టీకాకు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది..

రాష్ట్రపతి అనూహ్యం: రాజ్యసభకు స్వపన్ దాస్‌గుప్తా రీ-నామినేట్ -రామ్ జెఠ్మలానీ కొడుక్కి కూడా ఎంపీ సీటురాష్ట్రపతి అనూహ్యం: రాజ్యసభకు స్వపన్ దాస్‌గుప్తా రీ-నామినేట్ -రామ్ జెఠ్మలానీ కొడుక్కి కూడా ఎంపీ సీటు

సైనోవాక్‌కు అనుమతి

సైనోవాక్‌కు అనుమతి

కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో తయారై, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ ‘సైనోఫామ్' కాగా, ఇప్పుడు రెండో వ్యాక్సిన్ గా ‘సైనోవాక్'కు గ్రీన్ సిగ్నల్ లభించింది. డబ్ల్యూహెచ్ఓలోని టెక్నికల్ బృందం మే 5 నుంచి జరిపిన పరిశీలనలో చివరికి సైనోఫామ్ కు అనుమతివ్వాలని సిఫార్సు చేయడంతో డబ్ల్యూహెచ్ఓ ఆ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. సైనోవాక్ టీకాను రెండు డోసుల్లో ఇస్తారు. తొలి, రెండో డోసుకు మధ్య 2 నుంచి 4 వారాల గడువుంటుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా సామర్థ్యం 51శాతం నుంచి 84 శాతంగా నిర్ధారణ అయింది. చైనా తయారు చేసిన మూడో వ్యాక్సిన్ కాన్ సినో (కాన్ సినో బయోలాజికల్ ఫార్మా తయారీ) వ్యాక్సిన్ కూడా అనుమతి కోసం డబ్ల్యూహెచ్ఓను ఆశ్రయించింది.

వ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులువ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులు

వ్యాక్సిన్ మార్కెట్లో చైనా జోరు..

వ్యాక్సిన్ మార్కెట్లో చైనా జోరు..

చైనా తయారు చేసిన రెండు టీకాలకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలపడంతో ఆ రెండు (సైనోఫామ్, సైనోవాక్)లు కొవాక్స్ జాబితాలోకి ఎక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ కోసం డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన కొవాక్స్ లో లిస్ట్ కావడం ద్వారా చైనా వ్యాక్సిన్లు ప్రపంచ మార్కెట్లోక అందుబాటులోకి వచ్చినట్లయింది. మోదీ సర్కార్ ముందు నుంచే సరైన విధాన నిర్ణయాలు తీసుకుని ఉంటే, అలా ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశం భారత వ్యాక్సిన్లకు ఉండేది. వ్యాక్సిన్ల ఎగుమ‌తిపై భార‌త్ నిషేధం విధించడం వ‌ల్ల సుమారు 91 దేశాలు కొత్త క‌రోనా వేరియంట్ల‌తో ఇబ్బందిప‌డుతున్నట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. పుణెలోని సీరం సంస్థ‌తో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీలు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఒప్పందం ప్ర‌కారం వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాలి. అతి పేద ఆఫ్రికా దేశాల‌కు ఆ టీకాల‌ను అందించాల్సి ఉంది. కానీ భార‌త్ నుంచి వ్యాక్సిన్ల ఎగుమ‌తి లేక‌పోవ‌డం వ‌ల్ల 91 దేశాలు టీకాల కోసం ఎదురుచూస్తున్నాయ‌ని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే,

  H10N3 Bird Flu - First Human Case In China | Oneindia Telugu
  చైనాలో మళ్లీ కరోనా.. కొత్త రోగాలు..

  చైనాలో మళ్లీ కరోనా.. కొత్త రోగాలు..

  డ్రాగన్ చైనాలోని గాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులో మ‌ళ్లీ కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో గాంగ్‌జూ న‌గ‌ర విమానాశ్ర‌యానికి వ‌చ్చే సుమారు 660 విమానాల‌ను ర‌ద్దు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి సుమారు 50 శాతం విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. గాంగ్‌జూ న‌గ‌రంతో పాటు ఫోష‌న్ న‌గ‌రంలోనూ కొత్త‌గా కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్రపంచంలోనే తొలిసారిగా బ‌ర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‌ల‌లో ఒక‌టైన హెచ్‌10ఎన్‌3 చైనాలో తొలిసారి ఓ మ‌నిషికి సోకింది. జియాంగ్‌సు ప్రావిన్స్‌లోని ఝెంజియాంగ్ న‌గ‌రంలో ఉండే వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకిన‌ట్లు చైనా నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ (ఎన్‌హెచ్‌సీ) మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

  English summary
  The World Health Organization (WHO) said on Tuesday it has approved a COVID-19 vaccine made by drugmaker Sinovac Biotech (SVA.O) for emergency use listing, paving the way for a second Chinese shot to be used in poor countries. A WHO emergency listing is a signal to national regulators on a product's safety and efficacy. It will also allow the shot to be included in COVAX, the global programme to provide vaccines mainly for poor countries, which faces major supply problems due to an Indian export suspension.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X