• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ పాతకాపుతోనే మోడీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ : ప్రియాంకను సేఫ్ జోన్ లోకి తెచ్చుకున్న రాహుల్

|

లోక్ సభ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని రేపుతోన్న స్థానం వారణాశి. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, సాక్షాత్తూ ఆ పరమశివుడే కొలువై ఉన్నాడని భావించే వారణాశిలో రాజకీయ వేడి రాజుకుంది. సాధారణంగా- ప్రధానమంత్రి స్థాయి అభ్యర్థి ఎన్నికల బరిలో నిల్చున్నప్పుడు గెలుపు ఏకపక్షమౌతుంది. పెద్దగా ఆసక్తి ఉండదు. ప్రధానమంత్రి అభ్యర్థి సాధించే మెజారిటీ ఎంత అనే విషయంపై చర్చ సాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీ చేస్తోన్న వారణాశి లోక్ సభ స్థానంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి కారణం- కాంగ్రెస్ అభ్యర్థి. మోడీపై పోటీ చేయడానికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసింది. ఆచి, తూచి అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఆయనే- అజయ్ రాయ్.

వారణాశికి చెందిన నాయకుడు. వరుసగా అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. స్థానికంగా గట్టి పట్టు ఉన్న నేత. అజయ్ రాయ్ ను వారణాశి లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. దీనితో అత్యంత ఆసక్తికరంగా మారింది అక్కడి రాజకీయం. తొలుత- కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీ వాద్రాను బరిలో దించుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి వాస్తవ రూపం దాల్చలేదు. అరంగేట్రంలోనే నరేంద్ర మోడీ వంటి బలమైన నేతను ఢీ కొట్టడం ఎందుకనే ఉద్దేశంతోనే ప్రియాంకాను పోటీ నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్ఠానం.

రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే..కమలం పార్టీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి

రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే..కమలం పార్టీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి

నిజానికి- అజయ్ రాయ్ రాజకీయంగా ఓనమాలు దిద్దుకున్నది కాషాయ పార్టీలోనే. చాలాకాలం పాటు బీజేపీలో కొనసాగారు. అదే పార్టీ నుంచి శాసనసభకూ ఎన్నికయ్యారు. బీజేపీ కురువృద్ధుడు, లోక్ సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషికి కుడిభుజంగా వ్యవహరించారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కీలక నాయకునిగా కొనసాగారు. వరుసగా రెండుసార్లు ఆయన బీజేపీ అభ్యర్థిగా కొలాస్లా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. తన ప్రత్యర్థులపై భారీ మెజారిటీని సాధించారు. బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగారు.

లోక్ సభ టికెట్ దక్కకపోవడంతో బయటికి..

లోక్ సభ టికెట్ దక్కకపోవడంతో బయటికి..

చిన్న కారణంతోనే అజయ్ రాయ్ బీజేపీ నుంచి బయటికి వచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన లోక్ సభ టికెట్ ను ఆశించారు. దీనికోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. అవి విఫలం అయ్యాయి. పార్టీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మురళీ మనోహర్ జోషికే టికెట్ కేటాయించింది పార్టీ నాయకత్వం. దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన అజయ్ రాయ్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సమాజ్ వాది పార్టీలో తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అదే ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలాస్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వారణాశి పరిధిలోని పిండ్రా స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

రాజకీయ నేతగా కంటే గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు ఉందట..

రాజకీయ నేతగా కంటే గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు ఉందట..

అజయ్ రాయ్ కు రాజకీయ నాయకుడిగా కంటే గ్యాంగ్ స్టర్ గా, మాఫియా డాన్ గా గుర్తింపు ఉందనే వాదన వినిపిస్తోంది. 1989లో ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియా రాజ్యాన్ని విస్తరింపజేసిన బ్రిజేష్ సింగ్, త్రిభువన్ సింగ్ గ్యాంగ్ లో కీలకంగా మెలిగాడని అంటున్నారు. ఆయన మీద పలు నేరారోపణలు కూడా ఉన్నాయంటూ ఉత్తరాది మీడియా ఉటంకిస్తోంది. సాధువులు నిర్వహించిన ఓ ర్యాలీ, ప్రదర్శనపై దాడి చేశారనే కేసులో 2015లో అజయ్ రాయ్ అరెస్టు అయ్యారు. కొంతకాలం జైలు జీవితాన్ని గడిపారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా అజయ్ రాయ్ కారాగారవాసాన్ని అనుభవించారు. అనంతరం బెయిల్ పై బయటికి వచ్చారు.

లోకల్ వర్సెస్ నాన్ లోకల్..

లోకల్ వర్సెస్ నాన్ లోకల్..

వ్యూహాత్మకంగా అజయ్ రాయ్ ఇక్కడ స్థానిక నినాదాన్ని లేవనెత్తుతున్నారు. వారణాశి ఎన్నికలు తనకు మోడీకి మధ్య కాదని, స్థానిక, స్థానికేతర వ్యక్తుల మధ్య నెలకొన్న పోటీగా అభివర్ణిస్తున్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాది పార్టీలకు చెందిన క్షేత్ర స్థాయి క్యాడర్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారందరినీ కలుపుకొని పని చేస్తానని, మోడీని ఓడించి తీరుతానని అంటున్నారు అజయ్ రాయ్.

మెజారిటీపైనే కమలనాథుల దృష్టి

మెజారిటీపైనే కమలనాథుల దృష్టి

ఇదిలావుండగా- ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నాయకుల వైఖరి దీనికి భిన్నంగా ఉంటోంది. నరేంద్రమోడీ గెలుపు నల్లేరుపై నడకేనని, మెజారిటీ ఎంత తీసుకుని రావాలనే విషయం మీదే తాము కసరత్తు చేస్తున్నామని అంటున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా వారణాశి నుంచి పోటీ చేసిన నరేంద్రమోడీ.. అయిదు లక్షలకు పైగా మెజారిటీని సాధించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మోడీ అయిదు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ సారి మరింత మెజారిటీని సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు కమలనాథులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Following this, he left the BJP after he was denied a Lok Sabha ticket in favour of Murli Manohar Joshi. He then joined the Samajwadi Party and lost the 2009 Lok Sabha elections. Subsequently, he left the SP and decided to contest independently. He then won the 2009 Assembly by-election from Kolasla constituency and decided to join Congress. In 2012, he contested and won Assembly elections from Varanasi’s Pindra constituency. Rai was born and raised in Varanasi. His parents, Surendra Rai and Parvati Devi Rai, were originally from the Ghazipur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more