ప్రపంచ కరోనా కేసుల్లో సగం భారత్ నుంచే, మరణాలు 25 శాతం: డబ్ల్యూహెచ్ఓ వెల్లడి

జెనీవా/న్యూఢిల్లీ: గత వారం రోజులుగా ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో సగం భారతదేశం నుంచే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేగాక, ప్రపంచ కరోనా మరణాల్లో భారత్ నుంచి 25 శాతం ఉన్నాయని బుధవారం తెలిపింది.

గత 24 గంటల్లోనే భారతదేశంలో 3780 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో భారతదేశం నుంచే 46 శాతం ఉన్నాయని, మరణాలు 25 శాతం ఉన్నాయని వెల్లడించింది. బుధవారం మనదేశంలో 3,82,315 కొత్త కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

 WHO says India accounts for nearly 50% of worlds new Covid-19 cases, 25% of deaths

గత 14 రోజులుగా వరుసగా 3 లక్షల కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. భారత్ లో సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల, కొరత ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. దీంతో పదుల సంఖ్యలు ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్నారు.

Recommended Video

    Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Oneindia Telugu

    మరోవైపు పలు రాష్ట్రాలు తమకు వ్యాక్సిన తగిన మొత్తంలో అందడం లేదని కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. మే 1 నుంచి 18-44 ఏళ్ల వయస్కులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే టీకాలు ఇవ్వడం జరుగుతోంది. చాలా రాష్ట్రాలు ఈ వయస్కులకు కరోనా వ్యాక్సిన వేసేందుకు మరింత సమయం పడుతుందని స్పష్టం చేశాయి. ప్రస్తుతం 45ఏళ్లు పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని తెలిపాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+