సోనియా భేటీకి నితీష్ డుమ్మా, మోడీతో లంచ్‌కు ఓకే: కారణం ఇదే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్షాల కోసం ఇచ్చిన ప్రత్యేకమైన విందుకు కార్యక్రమానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాలేదు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్షాల కోసం ఇచ్చిన ప్రత్యేకమైన విందుకు కార్యక్రమానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాలేదు. అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే విందుకు హాజరుకానున్నారు.
చదవండి: ఉత్తర ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మారిషస్ ప్రధాని అనిరూద్ జుగనౌత్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ నేతలను మోడీ ఆహ్వానించారు.
మోడీ ఇచ్చే విందుకు నితీశ్ హాజరవుతున్నట్లు జేడీయూ ప్రతినిధి అజయ్ అలోక్ తెలిపారు. ఇది ఇద్దరు నేతల మధ్య జరిగే సమావేశమే కానీ, వ్యక్తిగతమైన విషయాలను ఏమీ చర్చించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని నితీశ్ కూడా ధ్రువీకరించారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు సోనియా విందుకు హాజరు కాకుండా, మోడీ ఇచ్చే విందుకు హాజరవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనిపై నితీష్ స్పందించారు.
విందు అనంతరం గంగా ప్రక్షాళన గురించి మోడీతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. బీహార్ అభివృద్ధి గురించే తాను ప్రధానితో భేటీ అవుతున్నట్లు చెప్పారు.
తాను ఇప్పటికే ఏప్రిల్‌లో సోనియా గాంధీని కలిశానని, ఇప్పుడు ఏ అంశం మీద చర్చిస్తున్నారో అదే అంశంపై (రాష్ట్రపతి ఎన్నికలు) అప్పుడే చర్చించానని, ఇప్పుడు మాత్రం ఆమె విపక్షాలన్నింటిని ఆహ్వానించారని చెప్పారు. తమ పార్టీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షులు శరద్ యాదవ్ హాజరయ్యారన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications