వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరాలు లేకుండా చేస్తామన్లేదు: మంత్రి సంచలనం, 'యోగి యూటర్న్'

ఉత్తర ప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా శక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీని తాము నేరాలు లేని రాష్ట్రంగా మారుస్తామని తాము ఎన్నికల సమయంలో హామీ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా శక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీని తాము నేరాలు లేని రాష్ట్రంగా మారుస్తామని తాము ఎన్నికల సమయంలో హామీ ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

యూపీ సీఎం యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిని నెరవేరుస్తున్నారు.

మంత్రి వ్యాఖ్యలపై విస్మయం

మంత్రి వ్యాఖ్యలపై విస్మయం

ఇలాంటి సమయంలో ఆయన కేబినెట్లోని కీలక మంత్రి అయిన సురేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మాత్రమే చెప్పామని సురేష్ తెలిపారు. నేరస్తులకు కళ్లెం వేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.

పెద్ద రాష్ట్రంలో నేరాలు ఆపడం కష్టం

పెద్ద రాష్ట్రంలో నేరాలు ఆపడం కష్టం

యూపీలో నేరాలు జరగకుండా ఆపడం చాలా కష్టమని సురేష్ తెలిపారు. యూపీ చాలా పెద్ద రాష్ట్రమని, నేరాలను పూర్తిగా నియంత్రించడం కష్టసాధ్యమన్నారు. కానీ రాష్ట్రంలో చిన్న సంఘటన జరిగినా తాము మాత్రం చర్యలు తీసుకుంటున్నామని, అలాగే హోంమంత్రి షహరన్‌పూర్‌కు ఓ కమిటీని పంపించారని తెలిపారు.

అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు

అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు

యూపీలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వారణాసిలో ఉన్నానని, కానీ అక్కడ (గ్యాంగ్ రేప్ జరిగిన ప్రాంతం) ఏం జరిగిందో తనకు తెలియదని మంత్రి అన్నారు. కానీ సంఘటనలపై తాము స్పందిస్తున్నామన్నారు.

యోగి సర్కార్ పైన విమర్శలు

యోగి సర్కార్ పైన విమర్శలు

షహరన్‌పూర్‌లో మత ఘర్షణలు తలెత్తడంతో యోగి సర్కార్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై అత్యాచారం చేసి, ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది.

మంత్రి వ్యాఖ్యలపై ఎస్పీ నేత మండిపాటు

మంత్రి వ్యాఖ్యలపై ఎస్పీ నేత మండిపాటు

దీంతో నేరాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సురేష్ ఖన్నా పై వ్యాఖ్యలు చేశారు. ఖన్నా వ్యాఖ్యలపై సమాజ్ వాది పార్టీ నేత రాజేంద్ర చౌదరి స్పందించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, బిజెపి ప్రభుత్వం ప్రజలను చీటింగ్ చేస్తోందని మండిపడ్డారు. ఇది యోగి ప్రభుత్వం వైఫల్యమని, యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.

English summary
Responding to the recent spate of crime and clashes in the state, UP minister Suresh Kumar Khanna said that the government did not promise a ‘crime-free UP’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X